Friday, May 3, 2024

నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టి తీర్పు వెల్లడించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో వారం రోజుల కస్టడీకి తీసుకుంది.

ఆ తర్వాత విజ్ఒప్తితో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించింది కోర్టు. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఎంటరైన సిబిఐ.. కోర్టు అనుమతితో ఏప్రిల్ 11న కవితను జైలు నుంచి అరెస్ట్ చేసి మూడు రోజుల కస్టడీ తీసుకుని విచారించింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో తొమ్మిది రోజుల పాటు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News