Saturday, May 4, 2024

వ్యాక్సిన్ తీసుకున్నవారి లోనూ డెల్టా వేరియంట్

- Advertisement -
- Advertisement -

Delta Variant Infects Both Vaccinated in Chennai

చెన్నై : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు వ్యాక్సినేషన్ పూర్తయిన వారికీ సోకుతోందని చెన్నైలో ఐసిఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాల ముప్పు తక్కువగా ఉందని పేర్కొంది. ఐసిఎంఆర్ ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ ఆమోదం పొందిన ఈ అధ్యయన వివరాలు ఈ నెల 17 న జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్ లో ప్రచురితమయ్యాయి. డెల్టా వేరియంట్ ఉనికికి వ్యాక్సినేషన్‌తో సంబంధం లేదని అధ్యయనం తేల్చింది. అయితే ఈ వ్యాధి తీవ్రత వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తక్కువగా ఉంటోందని, తదుపరి వేవ్‌లను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరంగా చేపట్టాలని పేర్కొంది. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్‌సీక్వెన్సింగ్‌ను నిరంతరం కొనసాగించాలని అధ్యయనం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News