Saturday, April 27, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న డెంటల్ డాక్టర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయిస్తున్న డెంటల్ డాక్టర్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి 53గ్రాముల ఎండిఎంఏ,850 గ్రాముల కెటామైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…వెస్ట్‌బెంగాల్‌కు చెందిన మహ్మద్ షాబీర్ అలీ అలియాస్ సుదీప్ బిస్వాస్ చాంద్రాయణగుట్టలో ఫర్ ఫెక్ట్ డెంటల్ అండ్ పైల్స్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. ఒడిసాకు చెందిన కాకు, చెన్నైకి చెందిన శివ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మూడు నెలల క్రితం బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహ్మద్ షాబీర్ అలీ నగరంలోని డెంటల్ డాక్టర్ దిలీప్ కుమార్ వద్ద పనిచేశాడు.

తర్వాత సొంతంగా క్లినిక్‌ను పెట్టాడు. వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో డ్రగ్స్ విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ఇడియా మార్ట్ వెబ్‌సైట్‌లో డ్రగ్స్ కొనుగోలుకు వెతకగా చెన్నైకి చెందిన శివ పరిచయమయ్యాడు. అతడికి రూ.30,000 పంపించడంతో ఎండిఎంఏ డ్రగ్స్‌ను బ్లూడార్ట్ కొరియర్‌లో పంపించాడు. దానిని విక్రయించేందుకు ప్రయత్నించగా ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఒడిసాలోని కాకు వద్దకు వెళ్లి కెటామైన్‌ను రూ.1,20,000 కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News