Monday, April 29, 2024

అగ్రనేతల మోహరింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ పార్టీలకు చెందిన దేశ నాయకుల పర్యటనలతో తెలంగాణ హోరెత్తుతోంది. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలతో జాతీయ నాయకులు తెలంగాణలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పర్యటిస్తూ హోరాహోరీగా ప్రచారపర్వా న్ని కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా, కేం ద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, సీయూష్‌గోయల్, ప్రకాశ్ రాజ్‌నాధ్ సింగ్‌లతో పాటుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మలు తెలంగాణలో పర్యటనలు చేశారు. వారి పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీ య అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రా హుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటుగా ఎఐసిసి నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లూసి) సభ్యులు, ఎఐసిసి కోశాధికారి అజయ్ మాకెన్, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ్ద మయ్య, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె.శివకుమా ర్, మరికొందరు కన్నడ ఎంఎల్‌ఎలు సైతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ కాంగ్రెస్ గెలుపు కోసం తమ వంతుగా కృషి చేస్తున్నారు. బిఎస్‌పి జాతీయ అధ్యక్షురాలు మాయావతి కూడా రాష్ట్రంలో ప్రచా రం నిర్వహించారు.

జాతీయ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీ నుంచి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆర్థ్ధిక మంత్రి టి.హరీశ్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి.రామారావులు పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎ అభ్యర్థులుగా బరిలో ఉన్న బిఆర్‌ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరవుతూ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ము చ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మం త్రులు హరీష్‌రావు, కెటిఆర్‌లు ఎక్కువగా రోడ్ షో లు, కార్నర్ మీటింగ్‌లు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, మీడియా సమావేశాలు, టివి ఛానెళ్లలో లైవ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాల్లో తమతమ ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. తెలంగాణ ప్రజల కళ్ల ముందే పుట్టిన బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించిందని, అ న్ని వర్గాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల ను కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమ రంగాలకు అధి క ప్రాధాన్యతను ఇస్తూ ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తున్నామన్నారు. మూడోసారి కూడా గెలిపిస్తే ప్రజలకు భారంగా మారిన గ్యాస్‌బండను కేవలం రూ.400కే అందజేస్తామని సరికొత్త హామీని ఇస్తూ బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతలు తమతమ ప్రచారాలను ముందుకు సాగిస్తున్నారు. అంతేగాక రైతుబంధును రూ.16 వేలు, ఆస రా పెన్షన్లను రూ.5వేలకు పెంచుతామని, రైతన్నల పంట రుణాలను కూడా మాఫీ చేస్తామని హామీలను ఇస్తూ కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావుల ప్రచారాలు ప్రజల హర్షధ్వానాల మధ్య ముందుకు సాగుతున్నాయి.

అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారిన కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, అం దుకు తెలంగాణ రాష్ట్ర పిసిసి నాయకత్వం రూపొందించిన మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేయిస్తామని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రజలకు హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500కే రైతాంగానికి పంట రుణాలను వెంటనే మాఫీ చేస్తామని, రైతుబంధు పథకం నుంచి ఎకరానికి రూ.15వేల రూపాయలను అందజేస్తామని, వృద్ధాప్య పెన్షన్లు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా, గ్యారెంటీగా అమలు చేయిస్తామని జాతీయ నాయకులు తెలంగాణ ప్రజలకు నమ్మబలుకుతున్నారు. ఇదిలావుండగా తెలంగాణ బిజెపి నాయకులు రూ పొందించిన మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ అమలయ్యేట్లుగా చూస్తామని చివరకు హోంమంత్రి అమిత్ షా కూడా హామీ ఇస్తున్నారు. వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.400కే ఇస్తామని, తెలంగాణ రైతు లు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధరగా క్వింటాల్‌కు రూ.3,100 ఇస్తామని, ఎరువులకు 50 శాతం సబ్సిడీలు ఇస్తామని, ఇక ప్రజలకు శిరోభారంగా ఉన్న పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్నులను తొలగిస్తామని తెలంగాణ బిజెపి నేతలు రూపొందించిన హామీలను అమలు చేయిస్తామని జాతీయ నా యకులు హామీలు ఇస్తున్నారు.

దీంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు చెందిన దేశ నాయకులు ప్రజలకు భరోసాలు ఇస్తున్నారు. ఇలా జాతీయ నాయకులు తెలంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను అధ్యయనం చేసుకొని మేనిఫెస్టోలకు ఆమోదముద్రలు తెలపడమే కాకుండా ఆ మ్యానిఫెస్టోలను అమలు చేయించే బాధ్యతలను కూడా తీసుకోవడం చర్చనీయాంశమయ్యింది. దీనికితోడు కాంగ్రెస్, బిజెపిలకు చెందిన అధిష్టానాలు కూడా ఏవైనా హామీలు ఇచ్చేటప్పుడు మీమీ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు, రెవెన్యూ రాబడులను దృష్టిలో ఉంచుకొని ఆచరణయోగ్యమైన హామీలను ఇవ్వాలని, ఓట్ల కోసం ఇబ్బడి ముబ్బడిగా అలవికాని హామీలిచ్చి ఎన్నికల తర్వాత అమలు చేయకపోతే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని నెల రోజుల ముందుగానే రాష్ట్ర నాయకత్వాలను ఈ రెండు జాతీయ పార్టీల అధిష్టానాలు హెచ్చరించాయని, అందుకే మేనిఫెస్టోల రూపకల్పనలోనే అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని, ఇప్పుడు జాతీయ నాయకుల పర్యటనల్లో ఈ అంశాలను గట్టిగా ప్రస్తావిస్తూ రాష్ట్ర నేతలు తయారు చేసిన మ్యానిఫెస్టోలను అమలు చేయించే బాధ్యత మాది అని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలే కాకుండా బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డాలు సైతం తమతమ సమావేశాల్లో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారని ఆ పార్టీల రాష్ట్ర నాయకులు వివరించారు. అందుకే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలు హామీల వర్షంతో మార్మోగిపోతున్నాయని అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News