Tuesday, April 30, 2024

సస్పెన్స్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Detective satyabhama movie

సిన్మా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. ఈ చిత్రం ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోనీ అగర్వాల్ మాట్లాడుతూ “7జి బృందావన్ కాలనీ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ ‘డిటెక్టివ్ సత్యభామ‘ అవుతుంది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు”అని అన్నారు. చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని హంగులతో తీర్చిదిద్దామని చెప్పారు. దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ “సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇందులో నాలుగు పాటలు, కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News