Monday, May 6, 2024

దేవరకద్ర కాంగ్రెస్‌లో .. సీటు దక్కేదెవరికి?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్న డిఎస్‌పి కిషన్
టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జి.మధుసూధన్ రెడ్డి
సామాజిక వర్గం ఆధారంగా చూస్తే కిషన్‌కు సీటు దక్కే అవకాశం
ఇప్పటి దాక రెడ్లకే టికెట్లు ఈ సారి బిసిలకు ఇవ్వాలని డిమాండ్
ఇదే జరిగితే బరిలోకి డిఎస్‌పి కిషన్
మక్తల్ వైపు చూస్తున్న సీతాదయాకర్ రెడ్డి
బిఆర్‌ఎస్ నేత ఆలను ఢీ కొట్టే బాద్‌షాలు ఎవరు ?

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: దేవరకద్ర రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బరిలో నిలుస్తుండగా కాం గ్రెస్, బిజెపి నుంచి ఎవరనేది ఇంకా సస్సెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 20లోగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయిని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా కాంగ్రెస్‌లో బిసి చిచ్చు రగులుతుండగా ఈ ప్రభావం దేవరకద్ర నియోజకవర్గంలో కూడా చి చ్చు రగులుతోంది. ఇప్పటి దాకా ఈ నియోజకవర్గంలో రెడ్లదే ఆధిపత్యంగా కొనసాగింది. ఈ సారి అయినా బిసిలకు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతో ంది. పార్లమెంట్ స్దానం నుంచి ఇద్దరు సామాజిక వర్గంగా ఇద్దరు బిసిలకు సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణలు జరిగితే దేవరకద్ర కాంగ్రెస్ టికెట్ బిసిలకు దక్కే అవకాశాలు ఉన్నాయి.

Also Read: బుధవారం రాశి ఫలాలు (12-09-2023)

కాంగ్రెస్‌కు డిఎస్‌పి కిషన్ దరఖాస్తు …

ఇంత వరకు పోలీస్ బాస్‌గా ఉన్న డిఎస్‌పి కిషన్ కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీ య సమాచారం.ఆయన బిఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించినా ఫలితం లేక పోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన గత కొంత కాలంగా ఉద్యోగానికి ధీర్ఘ కాలిక సెలవు పెట్టి దేవరకద్ర నియోజకవర్గంలో ప్రతి పల్లె తిరుగుతున్నారు. చాప కింద నీరులా తన అనుచరులను ప్రతి పల్లెలో ఏర్పాటు చేసుకొని పకడ్భందీ నెట్ వర్క్‌ను సిద్ధ్దం చేసుకున్నారు. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా అయినప్పటికి సుధీర్ఘ కాలం మహబూబూబ్ నగర్ జిల్లాలో నూ, అందులోనూ దేవరకద్ర నియోజకవర్గంలో పని చేశారు. అప్పటి నుంచి ఆయనకు ఉన్న వ్యక్తిగత సంబందాలు, పరిచయాలు అన్నింటినీ ఇప్పుడు రాజకీయంగా ఉపయోగిచుకునేందుకు సిద్ధం అవుతున్నారు. పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న సంబందాలతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా ఈయనకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టికెట్ హామీ మేరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.కత్తికి రెండు వైపు పదును అన్నట్లు ఒక వేళ సామాజిక వర్గంగా కేటాయిస్తే కూడా డిఎస్‌పి కిషన్ బిసి సామాజిక వర్గాని కి చెందిన వారు కావడంతో ఆయనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.జనరల్ కేటగిరిలోనూ తనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నియోజవర్గంలోని బి సి నేతల తో పాటు అన్ని వర్గా ల ప్రజ లు కూ డా డిఎస్‌పి కిషన్ పేరు ను ప్ర తిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం కిషన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ ప్ర జా సంఘాలు కూడా కిషన్‌కు మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి

పోటీలో మారు ఇద్దరు …

దేవరకద్ర కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు మరో ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జి. మధుసూధన్ రెడ్డి, మరో నేత ప్రదీప్ గౌడ్‌లు ఉన్నారు. వీరిలో జిఎంఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో సీనియర్‌గా ఉన్న ప్రదీప్ గౌడ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిఎంఆర్ ఒక వైపు డిసి సి బాధ్యతలు చూస్తూనే మ రో వైపు నియోజవర్గం లో కూడా పర్యటిస్తున్నారు. టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి ఈ సారి కొడంగల్ నుంచి పోటీ చేస్తుండడం తో మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సమర్దులు, గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వే రిపోర్టు ఆధారంగానూ, ఆర్దిక,సామాజిక కోణంలోనూ రేవంత్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తారన్న ఆసక్తిగా మారింది.అటు పోలీస్ బాస్‌గా ఉన్న డిఎస్‌పి కిషన్‌కా ? జిఎంఆర్ కా? ప్రదీప్ గౌడ్‌కా అన్నది ఈ నెల 20 వరకు వేచిచూడాల్సిందే.

మఖ్తల్‌ను ఆశిస్తున్న సీతమ్మ…

ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాజీ టిడిపి ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి దేవరకద్రను కాకుం డా ఆమె ఈ సారి మఖ్తల్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పిసిసి పెద్దలతో చర్చించిన తర్వాతనే ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమె భర్త స్వర్గీయ దయాకర్ రెడ్డి మఖ్తల్ ఎ మ్మెల్యేగా గతంలో పని చేయగా ఈమె 2014 వరకు దేవరకద్ర ఎమ్మెల్యేగా పని చేశారు. అయితే ఆమె ఈ సారి మఖ్తల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.

బాద్‌షా ఆలను ఢీ కొట్టగలరా ?:

రెండు సార్లు బిఆర్‌ఎస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని ఈ సారి మూడోసారి ఎదుర్కొనేందుకు ప్రతి పక్షపార్టీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రెం డో సారి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి 37 వేల భారీ మెజార్టీతో విజ యం సాధించారు. ఈ సారి అంతకు మించి మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. సిఎం కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సిఎం కెసిఆర్ గెలుపు అనే బహుమానాన్ని అందించాలని చూస్తున్నారు.ఇప్పటికే సిఎం వద్ద అభివృద్ధిలోనూ అపర బగీరథుడిగా పేరుంది. నియోజకవర్గ అభివృద్ధ్దితో పాటు సాగునీటి రంగ ంలో విన్నూత్న మార్పులు చేపట్టారు. సుమారు 30 చెక్ డ్యాంలు నిర్మించి రై తులకు అంకితం చేశారు. వేలాది ఎకరాలకు సాగునీరు కల్పించి రైతులకు అండగా నిలిచారు. పార్టీ ప రంగానూ క్షేత్ర స్దాయిలోనూ పఠిష్టంగా నిలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను ఢీ కొట్టే భాద్‌షాలు ఎవరనే తేలడం లేదు.ఆయనకు పోటీగా బిజెపి నుంచి పవన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి డిఎస్‌పి కిషన్, కాని జిఎంఆర్ కాని ఉండవచ్చుననే టాక్ నియోజకవర్గంలో విస్కృత చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News