Thursday, May 16, 2024

మంత్రిని తిట్టడం మాని అభివృద్ధిని చూడండి

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని తిట్టడం మానాలని నియోజక వర్గ స్థాయిలో మంత్రి చేసిన అభివృద్ధిని చూడాలని ఎంపిపి సామ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జియన్‌ఆర్ ఫంక్షన్ హాల్ లో మండల బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిని తిడితే ఎవరూ చూస్తూ ఊరుకోరాని ప్రజలు వచ్చే ఎలక్షన్‌లలో తప్పక బిజెపి పార్టీకి బుద్ధ్ది చెప్తారని అన్నారు.

మంత్రికి చుట్టాలయినప్పుడు నీకు చుట్టాలు కారా, వాళ్ళు బిజినెస్‌లు పెట్టుకున్నప్పుడు వాటికి ప్రశాంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో తెలుపగలరని మల్లికార్జున్‌ను ప్రశ్నించారు. అనంతరం జడ్పిటిసి సభ్యురాలు నర్సవ్వ నర్సారెడ్డి మాట్లాడుతూ జీవితంలో రాజకీయం చేయాలని కానీ జీవితమే రాజకీయం కాకూడదని అన్నారు.

ఒకసారి ఓడిపోయావ్ మళ్ళీ ఎలక్షన్‌లలో దమ్ము ఉంటే పోటీకి పోటీ చేయాలని అన్నారు. మీ ఎంపి ఏమి అభివృద్ధి చేసిండో చూపాలని, ఎక్కడ పోయింది పసుపు బోర్డు అని అన్నారు. క్వారీ మొత్తం ఇరవై కోట్ల రూపాయలు అయితే నాలుగు వందల కోట్ల రూపాయలు ఎందుకు ప్రశాంత్‌రెడ్డి కట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా ప్రశ్నించే ముందు ఆలోచించాలని అభివృద్ధి పై మాట్లాడాలని వారు హితవు పలికారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News