Tuesday, April 30, 2024

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

జన్నారం : గ్రామాల అభివృద్ధ్దే ప్రభుత్వ ద్యేయమని, ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మిర రేఖాశ్యాం నాయక్ అన్నారు. జన్నారం, చింతలపల్లి, చింతగూడ గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు గురువారం ఆమె భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా రేఖానాయక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధ్ద్దిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఒకొక్క భవన నిర్మాణానికి రూ. 20 లక్షల చొప్పున మంజూ రు చేసిందని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు ఒజ్జల బుచ్చవ్వ, గంగాధర్‌గౌడ్, ఆరె జ్యోతి శిరీష్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్‌కుమార్, మాజీ పార్టీ అద్యక్షులు చిట్టిమల భరత్‌కుమార్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అద్యక్షులు మహ్మద్ రియాజోద్దీన్, సర్పంచ్‌ల ఫోరం అద్యక్షుడు జాడి గంగాధర్, చింతగూడ సహకార సంఘం చైర్మన్ నాసాని రాజన్న, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్‌లు ముత్యం సతీష్, సీపతి బుచ్చన్న, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్, నాయకులు చిందం చంద్రయ్య, మల్క లక్ష్మణ్, రజాక్, డీవీఎస్ నాయక్, మండల ఎస్టీ సెల్ అద్యక్షుడు బానావత్ రాములు నాయక్, ఎంపీఈవో రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News