Friday, April 26, 2024

నన్నెప్పుడూ ప్రేమించాలి… నవ్వించాలి

- Advertisement -
- Advertisement -

Dhadak movie is Janvi kapoor

 

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ గురించి సినీప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘ధడక్’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన జాన్వీ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ 23 ఏళ్ల కుర్రభామ ఖాతాలో పెద్ద సినిమాలే ఉన్నాయి. గత ఏడాది ’గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ.. ప్రస్తుతం హారర్ కామెడీ ‘రూహి’ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసింది. ఈనెల 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే తాజాగా పెళ్లి గురించి జాన్వీ మాట్లాడుతూ “నేను వివాహం చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది.

ఇక భవిష్యత్తులో నేను కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యే వివాహం చేసుకుంటా. ఎందుకంటే నాకు హంగులు, ఆర్భాటాలు ఇష్టం ఉండదు. అలాగే నా పెళ్లి సాంప్రదాయబద్ధంగా పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో జరుపుకుంటాను. ఆ రోజున నేను కంజీవరం చీర కట్టుకుంటాను. నాకు కాబోయేవాడు లుంగీ కట్టుకుంటాడు. ఇక నా పెళ్లి భోజనంలో పూర్తిగా దక్షిణాది వంటకాలు ఉంటాయి. ఇక నా భర్త తెలివిగలవాడై ఉండాలి. అలాగే చేసే పనిలో నమ్మకం ఉండాలి. ముఖ్యంగా నన్నెప్పుడూ ప్రేమించాలి… నవ్వించాలి. ముఖ్యంగా అతను నా మైకంలోనే ఉండాలి”అని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News