Saturday, April 27, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థులకు అసమ్మతి గుబులు

- Advertisement -
- Advertisement -

Telangana Graduate MLC Polls 2021

ప్రత్యర్థి వర్గంతో చీకటి ఒప్పందాలు చేస్తున్న స్థానిక నేతలు
టిఆర్‌ఎస్‌కు మద్దతు పలికేందుకు హస్తం, కమలనాథుల ప్రయత్నాలు
అసంతృప్తివాదులను దారిలోకి తెచ్చుకునేందుకు నాయకుల తంటాలు
ఈసారి గెలుపునకు సహకరించాలని కోరుతున్న రేసు గుర్రాలు

పట్టభద్రుల ఎన్నికల ప్రచార పోరులో దూ సుకపోతున్న అభ్యర్థులకు అసమ్మతి సెగ తగలుతోంది. సొంత పార్టీలో ఉంటూ కొంతమంది స్థానిక నేతలు ప్రత్యర్థులతో రహస్య మంతనాలు జరుపుతూ రేసు గుర్రాలకు దడ పుట్టిస్తున్నారు. ప్రచారంలో ముందు వరుసలో ఉంటూ రాత్రి దాటితే ఇతర పార్టీ నేతలతో విందు రాజకీయాలు చేస్తున్నట్లు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, స్వతంత్ర అభ్యర్థులు వాపోతున్నారు. ప్రారంభంలో చురుకుగా పనిచేసిన నాయకులు రోజు రోజుకు దూరమైతున్నారని, వీరంతా అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి, టిడిపి పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థులకు అసమ్మతి సెగతో తలలు పట్టుకుంటున్నారు. నిన్నమొన్నటి దాక తమ వెనుకాల ఉన్న వారు ఇప్పుడు గులాబీ పార్టీ పెద్దలతో స్నేహం చేస్తే భవిష్యత్తులో ఆర్థ్దికంగా బలపడవచ్చని, అవసరమైతే రాజకీయ ఎదుగుదలకు కూడా అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ ఎవరి దారిలో వారు వెళ్లుతున్నట్లు ఆయా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి అసమ్మతులను గుర్తిస్తూ వారితో భేటీ నిర్వహిస్తూ ఆర్థికపరమైన సమస్యలుం టే తాము చూసుకుంటానని, ఈఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14న ఎన్నికలు జరుగుతుండ గా 93 మంది పోటీ చేయడంతో ఓట్లు చీలి అధికార పార్టీ అభ్యర్థి గెలుపు దోహదపడుతాయని పేర్కొంటూ ఈసారి పార్టీలో నమ్మకంగా పనిచేస్తే భవిష్యత్తులో ఉన్నత పదవులు కట్టబెడుతామని అసమ్మతులకు హామీలిస్తున్నట్లు ఆయా పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పా ర్టీకి ఈసమ్మతులు తాకిడి రోజు రోజుకు ఎక్కువైతుంది. టిఆర్‌ఎస్ నుంచి మాజీ ప్రధాని పివి కూతురు సురబివాణీదేవి నిలబడటంతో ఆమెకు హస్తం పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండటంతో వారంతా అటువైపు మొగ్గు చూపుతున్నట్లు, హస్తం పార్టీ నుంచి మాజీ చిన్నారెడ్డి బరిలో ఉండటంతో గ్రేటర్ పరిధిలో గులాబీ అభ్యర్థ్ది, మహబూబ్‌నగర్‌లో చూస్తే రెబెల్ అభ్యర్థ్ది హర్షవర్థ్దన్‌రెడ్డితో ఆశించిన స్థాయిలో ఓట్లు రావడం కష్టమని అంచనా వేస్తున్నారు.

అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి రాంచందర్‌రావుకు కూడా అసమ్మతిరాగం వినిపిస్తుంది. ఆయన రెండోసారి బరిలో ఉండటంతో మొన్నటివరకు టికెట్ ఆశించిన నేతలు ఆయనకు ప్రచారం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎన్నాళ్లు కార్యకర్తలాగా ఉండాలని, తాము కూడా ప్రజాప్రతినిధులు కావాలని పార్టీ కోసం కష్టపడితే పార్టీ పెద్దలు గుర్తించడంలేదని మండిపడుతూ రాంచందర్‌రావుకు షాక్ ఇస్తే, వచ్చే ఎన్నికల్లో తమకే చాన్స్ దొరుకుతుందని భావిస్తూ, టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంతర్గత సంభాషన్ల పేర్కొంటున్నారు. గ్రాడ్యుయేట్ ప్రచారంలో వేగంగా దూసుకపోతున్న అభ్యర్థులకు సంతృప్తి నేతలతో కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఏవిధంగానైనా వారు జారిపోకుండా శ్రమిస్తున్నట్లు వారి అనుచరగణం వెల్లడిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News