Sunday, April 28, 2024

రికార్డు స్థాయికి డీజిల్ ధర!

- Advertisement -
- Advertisement -

 

Diesel price increased by 20 paise
సర్వకాల గరిష్ఠానికి చేరువగా పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ లీటరుకు 25పైసలు, 30పైసలు పెంచడంతో గురువారం దేశంలో వాటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 101.64, ముంబయిలో రూ. 107.71 గా ఉంది. కాగా డీజిల్ రేటు లీటరుకు ఢిల్లీలో రూ. 89.87, ముంబయిలో రూ. 97.52గా ఉంది. స్థానిక పన్నురీత్యా వీటి ధరాల్లో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి. మూడు వారాల్లో పెట్రోల్ ధర పెరగడం ఇది రెండోసారి కాగా, డీజిల్ ధర పెరగడం ఇది ఐదోసారి.

అంతర్జాతీయంగా చమురు ధరలు మూడేళ్ల గరిష్ఠంలో ట్రేడవుతోంది. బ్రెంట్ బ్యారెల్ ధర 78.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 24 వరకు రోజువారీ ధరల సమీక్షచేశాయి. సెప్టెంబర్ 24న డీజిల్ ధర లీటరుకు రూ. 1.25 పెరిగింది. ఈ వారం పెట్రోల్ రెండు విడతల్లో 50 పైసలు పెరిగింది. భారత్ తన చమురు అవసరాలను 85 శాతం దిగుమతుల ద్వారానే భర్తీచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News