Wednesday, May 15, 2024

ఎంఎంటిఎస్ ఫస్ట్ క్లాస్ చార్జీలు 50 శాతం వరకు తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Discount of up to 50% on MMTS first class charges

సబర్బన్ ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ చార్జీల తగ్గింపు రేపటి నుంచి అమల్లోకి…
ఫలక్‌నుమా టు సికింద్రాబాద్ టు హైదరాబాద్ టు లింగంపల్లి టు రామచంద్రాపురం మధ్య
ప్రయాణించే వారికి ప్రయోజనకరం

మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ టు హైదరాబాద్ జంటనగరాల్లో ప్రముఖ సబర్బన్ రైలు సర్వీసు ఎంఎంటిఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌ఫోర్ట సర్వీసు)లో ఫస్ట్ క్లాస్‌లో సింగిల్ జర్నీలో ప్రయాణించే ప్రయాణికుల కోసం 50 శాతం వరకు చార్జీలను తగ్గిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సబర్బన్ రైళ్ల సర్వీసులో ఫస్ట్ క్లాస్ చార్జీల తగ్గింపును ఈనెల 05వ తేదీ నుంచి అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్‌లోని సబర్బన్ సెక్షన్లలో ఎంఎంటిఎస్ రైళ్లలో ప్రయాణించే వారి కోసం సింగిల్ జర్నీ ఫస్ట్ క్లాస్ చార్జీలు తగ్గించినట్టు అధికారులు తెలిపారు.

ఎంఎంటిఎస్‌లో తగ్గించే చార్జీలు ఈ విధంగా ఉంటాయి…

దూరం స్లాబ్ (కిమీలలో)                   ప్రస్తుత చార్జీ (రూ)              ఫస్ట్‌క్లాస్‌లో తగ్గించిన సింగిల్ జర్నీ చార్జీ (రూ)

                                                                                       (5 శాతం జిఎస్టీతో కలిపి)

1 నుంచి 5 కి.మీలు                   50 రూ.లు                                       25 రూ.లు

6 నుంచి 10 కి.మీలు                50రూ.లు                                         25 రూ.లు

11నుంచి15 కి.మీలు                65రూ.లు                                        35 రూ.లు

16నుంచి20 కి.మీలు                100రూ.లు                                     55 రూ.లు

21నుంచి25 కి.మీలు                100రూ.లు                                      55 రూ.లు

26నుంచి30 కి.మీలు               145రూ.లు                                       85 రూ.లు

31నుంచి35 కి.మీలు               145రూ.లు                                      85 రూ.లు

36నుంచి40 కి.మీలు                 155రూ.లు                                    90 రూ.లు

41నుంచి45 కి.మీలు              155రూ.లు                                       90 రూ.లు

29 రైల్వే స్టేషన్లు….50 కిమీలు…. 86 సర్వీసులు….

దక్షిణ మధ్య రైల్వే లాక్‌డౌన్ అనంతరం ఎంఎంటిఎస్ సర్వీసులను పునరుద్ధరించి శివారు ప్రాంతాల ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం ఫలక్‌నుమా టు సికింద్రాబాద్ టు హైదరాబాద్ టు బేగంపేట టు లింగంపల్లి టు తెల్లాపూర్ టు రామచంద్రాపురంల మధ్య 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిమీల మీదుగా 86 సర్వీసులను నడుపుతోంది. ఎంఎంటిఎస్ సెక్షన్లలోని వివిధ స్టేషన్లలో రద్దీ సమయాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులందరీ అవసరాలు నెరవేరేలా ఈ సర్వీసులను ప్రవేశపెట్టినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. జంట నగరాల్లోని శివారు ప్రాంతాల ప్రయాణికులకు వేగవంతమైన, చౌకైన రవాణా మార్గాలను అందిస్తూ ప్రస్తుతం సర్వీసుల ధరలను తగ్గిస్తూ ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలిగిస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు. వేసవికాలంలో ఎంఎంటిఎస్ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ఈ సమయంలో ఫస్ట్ క్లాస్ చార్జీల తగ్గింపు ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News