Tuesday, April 30, 2024

విద్యుత్ ఉద్యోగులకు 7% ఫిట్‌మెంట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 17 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు గా ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉద్యోగ సంఘాల నాయకులతో ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర రావు, ఎస్‌పిడిసిఎల్ ర ఘమారెడ్డిలు, ఎన్‌పిడిసిఎల్ గోపాల్‌రావులు పలుమా ర్లు సుధీర్ఘంగా చర్చలు జరిపి సఫలీకృతం అయ్యారు. ఇప్పటికే టిఎస్‌పిఈ జేఏసి నాయకులతో జరిగిన చర్చల్లో పిఆర్‌సి 7 శాతానికి అంగీకారం తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా హెచ్‌ఆర్‌ఎ అందేలా చూస్తామని హామీ ఇ చ్చింది.

సర్వీస్ వెయిటేజీ కింద ఐదేళ్లకు ఒక ఇంక్రిమెంటు, ఐదు నుంచి 15 ఏళ్లకు రెండు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్లు పైబడితే మూడు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇక గ్రాడ్యూటీ రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు ఇక ఉద్యోగులకు వైద్య ఖర్చుల కోసం రూ.5 నుంచి 10 లక్షలు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ఇదికాకుండా వేతన బకాయిలు 12 సమాన ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు వెల్లడించింది. అలాగే ఈపిఎఫ్ నుండి జిపిఎఫ్‌కు మార్పుపై ముఖ్యమంత్రికి నివేదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం వెల్లడించింది.
ఉద్యోగులు సమ్మె విరమించుకున్నారు : సిఎండి దేవులపల్లి ప్రభాకర రావు వెల్లడి టిఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయని సిఎండి దేవులపల్లి ప్రభాకర రావు తెలిపారు. వారితో చర్చలు సాఫీగా జరిగాయని, మరింత బాధ్యత మనపై పడిందనిచెప్పానన్నారు. వినియోగదారులపై భారం పడకుండా ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించమని చెప్పానన్నారు. ఈ క్రమంలో తమతో జరిగిన చర్చల్లో 7 శాతం పిఆర్‌సికి విద్యుత్ ఉద్యోగుల జేఏసి అంగీకరించారన్నారు.

టిఎస్‌పిఈ జేఏసితో ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపామని, విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 6 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రతిపాదించామని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయని, 7 శాతం పిఆర్‌సికి అంగీకరించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెల 17 నుండి తలపెట్టిన సమ్మె విరమించుకుంటున్నామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, తమకు విద్యుత్ ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారని సిఎండి ప్రభాకర్ రావు వెల్లడించారు.
పిఆర్‌సి పైనే ప్రధానంగా చర్చ జరిగింది – ఎన్. శివాజీ
2022 నుంచి పెండింగ్‌లో ఉన్న పిఆర్‌సీపైనే ప్రభుత్వంతో ప్రధానంగా చర్చ జరిగిందని టిఈఈఏ నేత ఎన్. శివాజీ తెలిపారు. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కొత్త పిఆర్‌సీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సిఎం కెసిఆర్ కృషి వల్లే మాకు ఈ పిఆర్‌సి లభించిందన్నారు. 7 శాతం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
చర్చలు సఫలం అయ్యాయి.. రత్నాకర్ రావు
ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని టిఎస్‌పిఈ జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు తెలిపారు. 17 నుంచి జరగాల్సిన సమ్మె విరమించుకుంటున్నామన్నారు. కొన్ని నిబంధనలు కూడా అడిగామని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఆర్టిజెన్స్ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారిస్తామని ప్రభుత్వం, యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. ఇంకా సమస్యలు ఉంటే మళ్లీ చర్చించుకుందామని సిఎండి చెప్పారన్నారు.
లేబర్ కమిషన్‌కు లేఖను గుర్తు చేసిన సిఎండి
కాగా ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటి (టిఎస్‌పిఎస్‌ఈ జాక్ ) తలపెట్టిన సమ్మె విషయంలో తెలంగాణ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని సయోధ్య కుదుర్చాలని ఏప్రిల్ 7వ తేదీన లేబర్ కమిషనర్‌ను తాము కోరిన విషయాన్ని దేవులపల్లి ప్రభాకర రావు గుర్తు చేశారు. కాగా ఇప్పటికే గత ఆదివారం ఉదయం 11గంటలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో చర్చలు జరిగాయి. ట్రాన్స్‌కో జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాల్ రావు,

ట్రాన్స్‌కో జేఎండి శ్రీనివాస రావు తదితరులు ఉన్న ఈ సమావేశంలో ప్రభుత్వం నుండి 7 శాతం ప్రతిపాదన చెయ్యగా టిఎస్‌పిఈ జేఏసి తొలుత అంగీకారం తెలియజేయలేదు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తప్పనిసరిగా 25 శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని, ఇందుకు తగిన పలు ఆధారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళారు. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు జరుపుకుంటూ వచ్చిన జేఏసితో ప్రభుత్వం పలుదఫాలుగా చర్చలు జరిపి ఒక కొలిక్కి తీసుకుని వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News