Saturday, May 4, 2024

ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలి

- Advertisement -
- Advertisement -

coronavirus

 

హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్‌డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, విజయవాడ, వైజాగ్ జిల్లాల్లో పూర్తిగా బంద్ పాటించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి జిల్లాల్లో జనసంద్రత ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతాల్లో నివసించే వారికి వైరస్ ఒకరి నుంచి మరోకరికి సులువుగా వ్యాప్తి చేందే అవకాశం ఉందని అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీంతో పాటు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక పాజిటివ్ కేసు నమోదుకావడంతో అక్కడ ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. అత్యసవర సేవలు మినహా మిగతా సర్వీసులు పూర్తిగా బంద్ కానున్నాయి. కరోనా వ్యాప్తి మరింత పెరుగుతున్న క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాల సిఎస్‌లు, కేంద్ర ప్రభుత్వం కెబినేట్ కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులతో చర్చించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వణుకుపుట్టిస్తున్న ఈ మహామ్మరిని తరిమికొట్టాలంటే ఖచ్చితంగా లాక్‌డౌన్ తప్ప మరో అప్షన్ లేదని అధికారుల సూచనలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్‌లో జరిగేది ఇదే…..
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ తప్ప మరో అప్షన్ లేదు. లాక్‌డౌన్‌గా ప్రకటించిన ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తారు. అన్ని సరిహాద్దుల్లో రవాణావ్యవస్థలు ఆగిపోతాయి. ఇతర ప్రాంతాల నుంచి లాక్‌డౌన్ ప్రాంతాలకు, లాక్‌డౌన్ ప్రాంతాల నుంచి వేరే ప్రదేశాలకు కేవలం అత్యవసర అవసరాల నిమిత్తం మాత్రమే రాకపోకలు సాగుతాయి. ప్రజలకు అవసరమయ్యే నిత్యవసర సౌకర్యాలను అందిస్తూ ఎక్కడి వారిని అక్కడ నిర్ధేశిత ప్రాంతంలో ఉండచమే లాక్‌డౌన్ ఉద్దేశం. ఈ విధంగా పాటించడం వలన వైరస్ వ్యాప్తిని తొందరగా అడ్డుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేగాక కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారిని వేగంగా గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Districts of Telangana are Locked down
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News