Friday, May 10, 2024

దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగర ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ శర్మాన్ ఆకాంక్షించారు. చీకటి నుంచి వెలుగులోకి …చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈసందర్భంగా బుధవారం జిల్లా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగను ఆనందోత్సవాలతో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండగను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన మేరకు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. సకల శుబాలు, సంపదలు, సౌభాగ్యాలు కలిగి ప్రతి ఇంటా కోటి ఆనంద దీపాలు వెలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News