Friday, May 10, 2024

నగరవాసులకు దీపావళి శుభాకాంక్షలు: మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

Mayor Gadwal Vijayalaxmi again caught in Controversy

 

మన తెలంగాణ /సిటీ బ్యూరో: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమైన దీపావళి పండుగ వెలుగులు నగరవాసుల జీవితాల్లో విరజిమ్మాలని మేయర్ ఆకాంక్షించారు. లక్ష్మిదేవిని ఆరాధించడం దీపావళి పండుగ విశిష్టత అన్నారు. టపాస్‌లు కాల్చేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ దీపావళి పండుగనుసంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మేయర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News