Tuesday, May 7, 2024

టిబెట్ బిల్లుకు ట్రంప్ సంతకం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: టిబెట్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటుకు వీలు కల్పించే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షులు ట్రంప్ చట్టబద్ధత కల్పించారు. ఇప్పటివరకూ ఉన్న బిల్లుపై సంతకం చేశారు. టిబెట్‌లో దలైలామా వారసత్వ ప్రక్రియ విషయంలో చైనా జోక్యం లేకుండా చేసేందుకు ఈ చట్టం దోహదం చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరం అయిన అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు సానుకూలతను కల్పించే విధంగా ట్రంప్ తమ అధికార అంతంలో బిల్లుకు చట్టరూపం తీసుకువచ్చారు. టిబెట్‌కు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న పలు కార్యక్రమాలు, నిబంధనలను తగు విధంగా సవరిస్తూ టిబెటియన్ పాలసీ, సపోర్టు యాక్ట్ 2020 అమలులోకి వచ్చింది. చైనాకు పూర్తి స్థాయిలో చెక్‌పెట్టేందుకే ట్రంప్ తీసుకువచ్చిన ఈ బిల్లుకు యుఎస్ సెనెట్ గత వారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ట్రంప్ సంతకంతో ఇప్పుడుఇది చట్టం అయింది.

Donald Trump Signature on Tibet bill

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News