Saturday, April 27, 2024

రైతుల కోసం ఆమరణ దీక్ష చేస్తా: అన్నా హజారే

- Advertisement -
- Advertisement -

రైతుల కోసం ఆమరణ దీక్ష చేస్తా: అన్నా హజారే
కేంద్రానికి జనవరి చివరి గడువు
పుణే: రైతుల డిమాండ్ల సాధనకు తాను ఆమరణ దీక్ష చేస్తానని ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే సోమవారం హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం జనవరి చివరి నాటికి రైతుల బాధలన్నింటినీ తీర్చాలి లేకపోతే తాను దీక్ష చేపడుతానని తెలిపారు. తన జీవితంలో ఇదే అంతిమ నిరసన కార్యక్రమం అవుతుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో హజారే విలేకరులతో మాట్లాడారు. గత మూడేళ్లుగా తాను వ్యవసాయదారుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్నానని, అయితే సర్కారు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరచూ శుష్కవాగ్ధానాలకు దిగుతోంది. ఈ ప్రభుత్వంపై ఎటువంటి నమ్మకం మిగలలేదన్నారు.

అన్ని విషయాలను పరిశీలించుకుని ఇప్పుడు కేంద్రానికి తాను జనవరి చివరి వరకూ గడువు ఇస్తున్నట్లు లేకపోతే నిరసనాస్త్రం ప్రయోగిస్తానని 83 ఏండ్ల ఈ నేత తెలిపారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు హజారే ఈ నెల 14వ తేదీన కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌కు లేఖ రాశారు. సాగు వ్యయాలు, ధరల సంబంధిత కమిషన్(సిఎసిపి)కి అటానమీ ఇవ్వాలని ఇందులో తెలిపారు. లేకపోతే నిరాహారదీక్షకు వెళ్లుతానని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు నిరసనలు సాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన బంద్‌కు మద్దతుగా హజారే ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగారు.

I Will hold protest for supporting farmers: Anna Hazare

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News