Tuesday, April 30, 2024

వరద సహాయక చర్యల్లో డిఆర్‌ఎఫ్‌దే కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

10 రోజుల్లో 184 ఫిర్యాదులు పరిష్కారం

 DRF plays key role in flood relief efforts

మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరంలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిహెచ్‌ఎంసిలోని డిఆర్‌ఎఫ్ విభాగం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. పోలీసు, విద్యుత్ శాఖలతో పాటు బల్దియా వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఎదురైన వాటిని పరిష్కరించేందుకు గడిచిన 10 రోజులుగా 24 గంటల పాటు మూడు షిప్టుల్లో ప్రత్యేక బృందాలు సహాయ చర్యలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా వర్షాలతో పలు చోట్ల నేల కూలిన చెట్లను యుద్ద ప్రాతిపదికన తొలగించడంతోపాటు అపార్ట్‌మెంట్ సెల్లార్, ఇళ్లు, రోడ్లు, తదితర ప్రాంతాల్లో వరద నీరు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అదేవిధంగా విధంగా ఎప్పటీకప్పుడు వాతావరణ శాఖతో పాటు కేంద్ర వాటర్ కమిషన్‌తో రిపోర్టుల పరిశీలిస్తూ వాటికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా జిహెచ్‌ఎంసి పరిధిలో ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, వార్డు సభ్యులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట్ల సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నగరంలో భారీ వర్షాలు కురిసినప్పటీ ఎక్కడా ఏలాంటి సంఘటనలు చోటు చోటు చేసుకోవడం గాని, ప్రాణ నష్టం గాని సంభవించకుండా అన్ని చర్యలను డిఆర్‌ఎఫ్ బృందాలు చేపట్టాయి. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్, శానిటేషన్ బృందాలతో కలిసి రోడ్లపై నీటి తొలగించడంతోపాటు వర్షం కారణంగా బ్రేక్ డౌన్ అయిన వాహనాలను రోడ్లపై నుంచి తొలగించి సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో డిఆర్‌ఎఫ్ బృందాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

10 రోజుల్లో 184 ఫిర్యాదుల పరిష్కారం: ఈవిఎండి డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి

వర్షాల కారణంగా నగరవాసులకు ఏలాంటి ఇబ్బందులు ఏర్పడిన వెంటనే 040 29555500, 9000113667 నంబర్లకు సంప్రందించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. నగరంలో కురుస్తున భారీ వర్షాలతో గత 10 రోజుల్లో నగరవాసుల నుంచి అందిన 184 ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా గత నెల 26వ తేదీ నుంచి ఈనెల 7వ తేదీవరకు గ్రేటర్ వ్యాప్తంగా 89 చోట్ల చెట్లు నేల కూలగా వాటిని తొలగించినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా 86 చోట్ల నీరు నిలిచిపోవడంతో విద్యుత్ మోటార్ల పంపుసెట్ల సహాయంతో వాటిని పూర్తి తొలగించి సాధారణ పరిస్థితులను నెలకొల్పినట్లు తెలిపారు. అదేవిధంగా భారీగా వరద నీటి చేరిన 9 ప్రాంతాల్లో రెస్కూ ఆపరేషన్ నిర్వహించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విశ్వజిత్ కంపాటి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News