Wednesday, May 1, 2024

‘స్కంద’ నుంచి డుమ్మరే డుమ్మా సాంగ్…

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’- ది ఎటాకర్ విడుదలకు ముందే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా మారుతోంది. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, రెండవ పాట మాస్ ఫోక్ నంబర్. బుధవారం మేకర్స్ చిత్రంలోని మూడవ సింగిల్- డుమ్మరే డుమ్మా సాంగ్‌ని విడుదల చేశారు. థమన్ డిఫరెంట్ ట్రాక్‌లను స్కోర్ చేశాడు. ఇప్పుడు సెలబ్రేషన్స్ వైబ్‌లతో డుమ్మరే డుమ్మా పాటని నింపారు.

ఇది పల్లె అందాన్ని, కుటుంబ సభ్యుల మధ్య గొప్ప బంధాన్ని చూపిస్తోంది. కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్, అయ్యన్ ప్రణతి ఆహ్లాదకరంగా పాడారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News