Monday, April 29, 2024

ప్రియాంక గాంధీ దంపతుల భూ లావాదేవీలపై ఇడి దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి 2005-06లో కొనుగోలు చేసిన మూడు స్థలాలతోపాటు ఆయన భార్య ప్రియంక గాంధీ వాద్రా జరిపిన భా లావాదేవాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇటీవల దాఖలు చేసిన మనీలాండరింగ్ చార్జిషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) వెల్లడించింది. రాబర్ట్ వాద్రాతో సంబంధాలు ఉన్న ఎన్‌ఆర్‌ఐ వ్యాపారి సిసి తంపితోపాటు మధ్యవర్తి సంజయ్ భండారీ బంధువైన సుమిత్ ఛద్దాపై నవంబర్‌లో కోర్టులో ఇడి చార్జిషీట్(ప్రాసిక్యూషన్ ఫిర్యాదు) దాఖలు చేసింది.

రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ వాద్రాలను చార్జిషీట్‌లో నిందితులుగా ఇడి ప్రస్తావించనప్పటికీ ఫిర్యాదులో వారిద్దరి పేర్లు ప్రేర్కొనడం మాత్రం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు ఈ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుని కేసు విచారణను జనవరి 29వ తేదీకి లిస్టింగ్ చేసింది. 2016లో భండారీ లండన్‌కు పారిపోగా ఇడి, సిబిఐ చేసిన న్యాయ అభ్యర్థనపై స్పందిస్తూ ఆయనను భారత్‌కు లప్పగించడానికి జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. విదేశాలలో ఉన్న తన ఆస్తులను వెల్లడించలేదన్న ఆరోపణలపై భండారీపై మనీ లాండరింగ్ ఆరోపణలను ఇడి, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి. 37 ఏళ్ల తంపిపై 2015లో ఫెమా కేసును నమోదు చేసిన ఇడి వాద్రాలు హూమి కొనుగోలు, అమ్మకం లావాదేవీలు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని తన చార్జిషీట్‌లో తెలిపింది.

రాబర్ట్ వాద్రాకు, తంపికి మధ్య గాఢమైన సుదీర్ఘ అనుబంధం ఉందని కూడా ఇడి పేర్కొంది. గతంలో రాబర్ట్ వాద్రాను ఇడి ప్రశ్నించగా తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన వాదించారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్‌ఎల్ పహ్వా ద్వారా హర్యానాలోని ఫరీదాబాద్‌లోగల అమీర్‌పూర్ గ్రామంలో 2005-2008 మధ్య 486 ఎకరాలను తంపి కొనుగోలు చేశారని ఇడి తెలిపింది. 2005-06 మధ్య కాలంలో రాబర్ట్ వాద్రా కూడా హెచ్‌ఎల్ పహ్వా నుంచి అమీర్‌పూర్‌లో 40.08 ఎకరాల విస్తీర్ణంలో మూడు స్థలాలు కొనుగోలు చేసి 2010 డిసెంబర్‌లో హెచ్‌ఎల్ పహ్వాకే విక్రయించినట్లు చార్జిషీట్‌లో ఇడి పేర్కొంది. 2006 ఏప్రిల్‌లో ప్రియాంక గాంధీ వాద్రా అమీర్‌పూర్‌లో 5 ఎకరాల వ్యవసాయ భూమిని హెచ్‌ఎల్ పహ్వా నుంచి కొనుగోలు చేసి 2010 ఫిబ్రవరిలో అదే భూమిని హెచ్‌ఎల్ పహ్వాకు విక్రయించారని ఇడి తెలిపింది.

ఈ లావాదేవీలకు సంబంధించి జరిగిన ధన మార్పిడి పహ్వా లెక్కల్లో చూపలేదని ఇడి తెలపింది. రాబర్ట్ వాద్రా కూడా మొత్తం డబ్బును పహ్వాకు చెల్లించలేదని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని ఇడి తెలిపింది. ఈ కేసులో 2020 జనవరిలో తంపిని ఇడి అరెస్టు చేసింది. రాబర్ట్ వాద్రాకు తంపి చాలా సన్నిహితుడని ఇటీవల ఒక ప్రకటనలో ఇడి తెలిపింది. తంపి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

రాబర్ట్ వాద్రా లడన్‌లోని తన భవానాన్ని మరమ్మతులు చేసి అందులోనే నివసిస్తున్నారని, ఇది మనీలాండరింగ్ ద్వారా వచ్చిన సొమ్ముగా అనుమానిస్తున్నామని ఇడి పేర్కొంది. 2017 ఫిబ్రవరిలో భండారీతోపాటు ఇతరులపై ఇడి క్రిమినల్ కేసు నమోదు చేయగా దాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆదాయం పన్ను శాఖ 2015కి చెందిన నల్ల ధనం చట్టం కింద ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News