Saturday, April 27, 2024

వేలం కోసం వెయ్యి కోట్ల నీరవ్ ఆస్తులను విడుదల చేసిన ఇడి

- Advertisement -
- Advertisement -

ED releases Nirav Modi assets

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేలాది కోట్ల మేర మోసంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన 1000 కోట్ల రూపాయలకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తునుంచి విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన బకాయిలను వసూలు చేసుకోవడానికి వీలుగా వేలం వేయడానికి గాను ఇడి తాను గతంలో జప్తు చేసిన ఈ ఆస్తులను విడుదల చేసింది. నీరవ్ మోడీకి చెందిన ఆస్తులను వేలం వేయడానికి నేషనల్ కంనెనీ లా బోర్డు ఒక లిక్విడేటర్‌ను నియమించింది.

ఇడి విడుదల చేసిన ఆస్తుల్లో ముంబయి కుర్లా లోని కాలాఘోడా ప్రాంతంలో ఉన్న ఆఫీస్ బిల్డింగ్‌తో పాటుగా నీరవ్ మోడీకి చెందిన జ్యుయలరీ కూడా ఉంది. ఈఆఫీసు భవనంలో రిథమ్ హౌస్ మ్యూజిక్ స్టోర్ ఉంది. గతంలోనే కొన్ని ఆస్తులను వేలం వేయడానికి ఇడి విడుదల చేయగా, మరికొన్ని ఆస్తులను విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో అహ్మద్‌నగర్ జిల్లాలోని సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. గతంలో తాను స్వాధీనం చేసుకున్న కార్లు, పెయింటింగ్‌లు, విలువైన వస్తువులను వేలం వేయగా వచ్చిన 6 కోట్ల రూపాయలను ఇడి ఇదివరకే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News