Saturday, May 11, 2024

దాని కంటే గొప్ప సంతోషం ఎక్కడా ఉండదు

- Advertisement -
- Advertisement -

Poster released from Ramarao on duty

 

మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో రవితేజ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించబోతోన్నారు. క్రిస్మస్ సందర్భంగా చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవి తేజ ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. రవితేజ చేస్తోన్న సాయం, అది అందుకున్న వారి కళ్లలో ఆనందం పోస్టర్‌లో కనిపిస్తోంది. మన గురించి మనం కాకుండా పక్క వారి గురించి ఆలోచించి సాయం చేస్తే దాని కంటే గొప్ప సంతోషం ఎక్కడా ఉండదు అని పోస్టర్ మీద రాసి ఉంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News