Friday, May 10, 2024

స్వరాష్ట్రంలో విద్య నాణ్యత ప్రమాణాలు పెరిగాయి

- Advertisement -
- Advertisement -
సిఎం కెసిఆర్ కృషితో అందరికి విద్య అందుబాటులో ఉంది: ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవడానికి సిఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో స్కూల్ ఎడ్యుకేషన్‌పై నిర్వహించిన మూడు రోజుల ఒరియేంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత విద్య నాణ్యత పెరిగిందని, ‘మన ఊరు – మన బడి’ ద్వారా రాష్ట్రం లోని చాలా పాఠశాలలను అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తీర్ణతలో ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల నుండి ఉండడం ఎంతో గర్వకారణం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను ప్రజలకు తెలియజేసేలా, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News