Monday, April 29, 2024

ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం

- Advertisement -
- Advertisement -

Nation Economy

 

గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్‌డౌన్‌తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్‌డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా సరే సొంత ఇంటికి వెళ్లాలనుకోవడం మానవ సహజం
వలస కూలీలను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ నిబంధనలు సడలించాం
మీరిచ్చే సలహాల మేరకే భారత భవిష్యత్‌కు మార్గం వేద్దాం : వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ

 

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునః ప్రారంభానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. లాక్‌డౌన్ 3 ముగింపు దశలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత ప్రధాని మాట్లాడారు. లాక్‌డౌన్‌తో దెబ్బతి న్న ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడమే ప్రధాన సవాలు అని తెలిపా రు. ఇందుకు సరైన సమగ్ర వ్యూ హంతో వెళ్లాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. కరోనా వైరస్ గ్రామాలకు సోకకుండా చూసుకోవడమే ఇప్పుడు దేశం ముందున్న పెద్ద సవాలని మోడీ అన్నారు. వైరస్ ముప్పు నుంచి ఇండియా తనకు తాను రక్షించుకుంటున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయని, ఇది అన్ని రాష్ట్రాల సహకారంతోనే సాధ్యమైందని అన్నారు. లాక్‌డౌన్‌తో తదనంతరం వలస కూలీల ఆందోళనను అర్థం చేసుకోగలనని, సొంత ఇంటికి వెళ్లి తమ ఆప్తులను కలుసుకోవాలని అనుకోవడం మానవ సహజమని అని అన్నారు.

అందువల్లనే లాక్‌డౌన్‌లో కొన్ని నిబంధనలను సడలించి వలస కూలీలకు మార్గం సుగమమం చేయాల్సివచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ గ్రామాలకు పాకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌తో ఏర్పడ్డ ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కేంద్రం స్థాయిలో ఆర్థిక ప్యాకేజీ రూపొందుతుందని వివరించారు. ఆరు గంటల పాటు సిఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. ప్రధానంగా రెండు డిమాండ్లు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్యాకేజీ గురించి, వైరస్ పీడిత జిల్లాల నిర్థిష్ట గుర్తింపులో రాష్ట్రాలకు అధికారం గురించి ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడం ప్రధాన అంశం అని, ఆర్థిక వ్యవస్థను తిరిగి సక్రమమైన బాటలో పెట్టడం గురించి అన్ని మార్గాలను అన్వేషిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలూ తమ వైఖరిని తెలియచేయాలని తాము కోరినట్లు , అన్నింటిని పరిశీలించి ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తాము చెప్పినట్లు ప్రధాని తెలిపారు.

ఈ క్రమంలో పలు రాష్ట్రాల సిఎంలు వేర్వేరు అభిప్రాయాలను తెలియచేశారని, పంజాబ్, అసోంతో పాటు నాలుగు రాష్ట్రాలు ప్రస్తుత లాక్‌డౌన్‌ను మరింతగా పొడిగించాలని కోరాయని తెలిపారు. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ 3 గడువు ఈ నెల 17తో ముగుస్తుంది. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సిఎంలు ఇప్పుడే రైళ్ల రాకపోకలు, విమానాల పునః ప్రారంభం వద్దని చెప్పారని, దీనితో కరోనా కట్టడి ఇబ్బంది అవుతుందని తెలిపారని వివరించారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్ పొడగించాలని మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల సిఎంలు కోరినట్లు సమాచారం.

పిఎంతో వీడియో భేటీలో పది అంశాలు

1 కరోనా సాకుతో కేంద్రం రాజకీయాలకు దిగుతోందని పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ విమర్శించారు. ఇది రాజకీయాలకు అదును కాదని హితవు పలికారు. సమాఖ్య విధానానికి తూట్లు పొడవరాదన్నారు.
2 దేశ రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఆరంభం కావాలి

– ఢిల్లీ సిఎం కేజ్రీవాల్

3) రైళ్లను ఈ నెలాఖరు వరకూ నడపరాదు

– తమిళనాడు సిఎం పళనిస్వామి

4) వ్యవసాయ మార్కెట్లను తెరవాలి, ప్రజా రవాణాను ప్రారంభించాలి

– ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి

5) రైలు, రోడు, విమాన ప్రయాణాలను అనుమతించాలి. కొన్ని ఆంక్షలు అమలు చేయాలి. ప్రజా రవాణాపై రాష్ట్రాలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండాలి

– కేరళ సిఎం విజయన్

6) జోన్ల వారీగా లాక్‌డౌన్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి. ఈ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది. కరోనా కట్టడికి వీలుంటుంది

– పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్

7 ) వలస కూలీలకు తగు విధంగా ఏర్పాట్లు చేయాలని దాదాపుగా అన్ని రాష్ట్రాల సిఎంలు కోరారు. లాక్‌డౌన్‌తో వీరే ఎక్కువగా బాధితులు అయ్యారని, వీరిని అన్ని విధాలుగా ఆదుకోవల్సి ఉందన్నారు. 8) ప్రత్యేక రైళ్లు ఆరంభం అవుతున్నా, శ్రామిక్ రైళ్లు నడుస్తున్నా ఇప్పటికీ పలు ప్రాంతాలలో ప్రజలు చిక్కుపడే ఉన్నారని కొన్ని రాష్ట్రాల సిఎంలు తెలిపారు. 9 ) చిన్న మధ్యతరహా పరిశ్రమల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఉపాధి కల్పన జరుగుతుందని సిఎంలు తెలిపారు. 10 దేశంలో కరోనా కేసుల సంఖ్య సోమవారం పెరిగింది. అయితే రికవరీ రేటు 31 శాతానికి చేరుకోవడం గణనీయ పరిణామమని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News