Saturday, May 4, 2024

ఎంఎల్ఎ పోతే ఎంఎల్ సి

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేనే కొనసాగుతారని ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ఆదివారం స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో షిండే అనర్హత వేటుకు గురయ్యే ప్రసక్తే లేదని, ఒక వేళ వేటు పడ్డా ఆయననే సిఎంగా కొనసాగుతారని తెలిపారు. ఎమ్మెల్యేగా సభ్యత్వం పోతే ఆయన ఎమ్మెల్సీ అవుతారని, సిఎం పదవికీ ఢోకా లేదని వెల్లడించారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం ఇప్పుడు స్పీకర్ తుది నిర్ణయం పరిధిలో ఉంది. ఎటువంటి జాప్యం లేకుండా స్పీకర్ రాహుల్ నార్వేకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు తుది అవకాశం ఇస్తున్నట్లు ఇటీవలే సుప్రీంకోర్టు పేర్కొంది. దీనితో త్వరలోనే సిఎం ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News