Saturday, April 27, 2024

ఆస్తి కోసం చెల్లిని చంపిన అన్న

- Advertisement -
- Advertisement -

Elder brother killed sister for property in Golconda

కత్తితో గొంతు కోసి హత్య
గొల్కొండ పిఎస్ పరిధిలో సంఘటన

హైదరాబాద్: ఆస్తి కోసం సొంత సోదరిని అన్న హత్య చేసిన సంఘటన నగరంలోని గొల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని టోలీచౌకికి చెందిన ఆరిఫ్ అలీ(30), ఫాతిమా(42) ఇద్దరు తమ్ముడు, అక్క. ఫాతిమా భర్త మున్సిపాలిటీలో పనిచేసేవాడు. అనారోగ్యానికి గురికావడంతో 2010లో మృతిచెందాడు, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి ఫకీర్‌అలీ నుంచి టోలీచౌకిలోని ఆడమ్స్ కాలనీలో ఉన్న టింబర్‌డిపో, ఇళ్లు వచ్చాయి. తల్లిదండ్రుల ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలని గత కొంత కాలం నుంచి ఫాతిమా తమ్ముడు ఆరిఫ్ అలీని అడుగుతోంది. ఆస్తి ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం ఎక్కువ కావడంతో ఆరిఫ్ అలీ కత్తితో ఫాతిమా గొంతు కోశాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫాతిమా మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేశారు. పోస్టుమార్టం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గొల్కొండ ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News