Sunday, April 28, 2024

కరెంట్ బిల్లు.. గుండె గుభేల్

- Advertisement -
- Advertisement -
Electric Bill Shock To Hyderabad Citizen
నెలకు రూ 6.67లక్షల బిల్లు, ఆందోళనలో వినియోగదారుడు

హైదరాబాద్: అధికారుల నిర్లక్షమో, వినియోగదారుల గ్రహచారమో కానీ కొద్ది రోజులుగా విద్యుత్ బిల్లులు వినియోగదారులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. నగరంలోని అంబర్‌పేట, పటేల్‌నగర్ నివాసి బి. వీరబాబు ఇంటి (సర్వీస్ నెం. విజెడ్ 074326)రి ఒక నెలకు రూ. 6లక్షలు 67వేల 610 కరెంటు బిల్లు వచ్చింది. సాధారణంగా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల్లో రావాల్సిన బిల్లు.. కేవలం ఒక సాధారణ గృహనికి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలే ఆరు నెలల నుంచి ఎటువంటి పనులు లేక ఇబ్బంది పడుతుంటే పుండు మీద పుట్రలో ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావడం ఏమిటో తనకు అర్థం కావడం లేదని ఇంటి యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లు కట్టాలంటే ఇల్లు అమ్ముకోవాల్సి ఉంటుందని బాధితుడు వాపోయాడు. నిబంధనల ప్రకారం ఇంత పెద్దమొత్తంలో బిల్లు వస్తే సదరు బిల్లును సాధారణంగా సెక్షన్ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి, సంబంధిత అకౌంట్ అధికారులతో చర్చించి మాత్రమే ఇస్తారు. కానీ ఈ నిబంధనలు పాటించడం లేదంటే సెక్షన్ అధికారుల నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వాటితో విద్యుత్ శాఖ అప్రతిష్టను మూటకట్టకోవడమే కాకుండా, విద్యుత్ సంస్థ మీద వినియోగదారులకు నమ్మకం కూడా సడలిపోయే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News