Saturday, May 4, 2024

రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

Engineering EAMCET Counseling begins Monday

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థులకు రవచ్చే నెల 4 నుంచి 11 వరకు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News