Saturday, September 21, 2024

జెఇఇ మెయిన్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(జెఇఇ) 2023 నోటిఫికేషన్ వెలువడింది. 2023 జనవరి 24,25,27,28,29,30,31 తేదీలలో మొదటి విడత, ఏప్రిల్ 6,7,8,9,10,11,12 తేదీలలో రెండో పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది. ఈసారి రెండు విడతల్లో జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత నిర్వహించనున్నట్లు తెలిపింది.

జెఇఇ మెయిన్ మొదటి విడత దరఖాస్తులు గురువారం(డిసెంబర్ 16) నుంచి జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు వరకు స్వీకరించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో జెఇఇ మెయిన్ పరీక్ష జరగనుంది. జెఇఇ మెయిన్ జనవరి సెషన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు ఉంటే 011 40759000/ 011 69227700 ఫోన్ నెంబర్లకు లేదా jeemain@nta.ac.inకు ఇమెయిల్ చేయాలని ఎన్‌టిఎ తెలిపింది.
గతంలో మాదిరిగానే రెండు సెషన్లు
జెఇఇ మెయిన్ 2022ను నిర్వహించిన విధంగానే రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలో విద్యార్థులు ఏదో ఒక సెషన్‌కు లేదా రెండు సెషన్లకు హాజరుకావచ్చు. కొవిడ్ పరిస్థితులకు ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారంగానే 2023 జెఇఇ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. జెఇఇ మెయిన్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా ఈసారి ముందుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్‌ను ప్రకటించింది. గత ఏడాది తొలి విడత జూన్ 20- నుంచి 29 తేదీల మధ్య జరగగా, రెండో సెషన్ పరీక్షను జులై 21- నుంచి 30 తేదీల మధ్య నిర్వహించారు. ఈ రెండు విడతలకు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 9,05,590 మంది పరీక్షకు హాజరయ్యారు.

దేశంలోని ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటి, ఇతర విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జెఇఇ మెయిన్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో టాప్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఐటిల్లో ప్రవేశాలకు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్(యుజి) పరీక్షను మే 7న నిర్వహించనున్న ప్రకటన వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News