Wednesday, May 15, 2024

18 నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు

- Advertisement -
- Advertisement -

Engineering web selections start from October 18th

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సవరణ షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన స్లాట్ బుకింగ్ ప్రక్రియ తేదీని ఈ నెల 19 వరకు పొడిగించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సోమవారం(అక్టోబర్ 12) నుంచి ఈ నెల 20 వరకు జరుగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 24వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.

సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 29 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నవంబర్ 2న ఇంజినీరింగ్ తుది విడతలో సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 4వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ శనివారం వరకు 35,124 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఇప్పటివరకు ఖరారు కాకపోవడంతో ఎంసెట్ షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ వెబ్ ఆప్షన్ల గడువును పొడిగించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News