Monday, April 29, 2024

రేపు, ఎల్లుండి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

Assembly session begins tomorrow

 

మున్సిపల్, చట్టసవరణతో పాటు పలు బిల్లులపై చర్చ
శాసనసభ పరిసరాల్లో 144 సెక్షన్, సభ్యులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి : స్పీకర్

మనతెలంగాణ/హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలకు రంగం సిద్ధమైంది. మంగళవారం శాసనసభ, బుధవారం శాసనమండలి సమావేశాలు జరగ నున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా మున్సిపల్ చట్టాలపై సుధీర్ఘంగా చర్చజరగనుంది. ఈ ప్రత్యేక సమావేశంలో రైతు ధాన్యం సేకరణ, మొక్కజొన్న పంటలు, నాలా చట్టానికి సవరణలు, భూమార్పిడి సులభతరం చేస్తూ సంబంధిత చట్ట సవరణ,రిజిస్ట్రేషన్ చట్టసవరణ, జిహెచ్‌ఎంసి చట్టం 1955 చట్టసవరణ, ఆన్‌లైన్ ఆస్తుల నమోదు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిఫ్ విధానంపై చట్టసభల్లో చర్చ జరగ నుంది. అయితే మధ్యాహ్నం అనంతరం కూడా శాసనసభ సమావేశాలు కొనసాగే అకాశం ఉండటంతో బారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు బందోబస్తు, అసెంబ్లీ చుట్టూ 144 సెక్షన్, బ్యారికెట్స్ ఏర్పాటు చేశారు.

కరోనా పరీక్షలు చేయించుకోవాలి

ఎలాంటి సందేహాలున్నా, కరోనా లక్షణాలున్నా తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేసుకున్న అనంతరమే శాసనసభ, మండలిలోకి సభ్యులు ప్రవేశించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. కరోనా లక్షణాలున్న సభ్యులను, ఇతర సిబ్బంది సభకు రాకుండా ఉండటమే మంచిదని ఆయన చెప్పారు. అలాగే కరోనా నిబంధనలు శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఆయన చెప్పారు. శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఈనెల 13,14 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

కోవడ్ 19 మహమ్మారి దృష్టిలో పెట్టుకుని అందరి శ్రేయస్సు దృష్టా సమావేశాల నిర్వహణలో జాగ్రతలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోవిడ్19 పరీక్షలకోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే సభ్యులు, శాసనసభ సిబ్బంది, మీడియా ప్రతినిధులు,పోలీసు సిబ్బందికి కరోనా లక్షణాలు తప్పక పరీక్షలు చేయించుకోవాలని శాసనమండలి కార్యదర్శి డా.వి. నరసింహా చార్యులు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలు సోమవారం మద్యాహ్నం 2 గంటల నుంచి సభల ప్రాంగణాలల్లో పనిచేస్తాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News