Wednesday, May 1, 2024

నటరాజన్‌పై వాన్ పొగడ్తలు

- Advertisement -
- Advertisement -

లండన్: ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లపై వరుసగా నోరు పారేసుకుంటున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన పంథాను మార్చుకున్నాడు. ఆఖరి మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి టీమిండియాను గెలిపించిన యువ స్పీడ్‌స్టర్ నటరాజన్‌పై వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి ఓవర్‌లో నటరాజన్ బౌలింగ్‌ను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ నటరాజన్ తడబడకుండా బౌలింగ్ చేసిన తీరు తనను ఎంతో కట్టి పడేసిందన్నాడు. ఇంగ్లండ్ నుంచి మ్యాచ్‌ను దూరం చేసిన ఘనత అతనికి మాత్రమే దక్కుతుందన్నాడు. ఈ మ్యాచ్‌లో శామ్ కరన్, నటరాజన్‌లు అసాధారణ ప్రదర్శణ చేశారన్నాడు. తమ తమ జట్లకు విజయం అందించేందుకు యువ క్రికెటర్లు పోరాడిన తీరు చూడముచ్చటగా ఉందని వాన్ పేర్కొన్నాడు.

England Ex Cricketer Michael Vaughan praises Natarajan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News