Tuesday, April 30, 2024

మూడో టెస్టు: పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత జట్టు 507 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్ జట్టు పడింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్  కే పరిమితమయ్యారు.  బెన్ డకెట్ నాలుగు పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. జాక్ క్రాలే 11 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ఓలీ పోప్ మూడు పరుగులు చేసి రవీంద్రజడేజా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.

జానీ బయిర్‌స్టో నాలుగు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. జోయ్ రూట్ ఏడు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఐదో వికెట్ రూపంలో మైదానం వీడాడు. బెన్ స్టోక్స్ 15 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో వెనుదిరిగాడు. రెహ్మన్ అహ్మద్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో బెన్ రెహాన్ అహ్మాద్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.  రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా  కుల్దీప్ యాదవ్ రెండు, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్: 445
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 319
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 430/4

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News