Friday, May 3, 2024

‘ప్రకృతిని ఆస్వాదించండి.. పర్యావరణాన్ని కాపాడండి’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షకుడు, జంతు ప్రేమికుడైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వీకెండ్ డేస్‌లో ప్రకృతిని ఆరాధిస్తుంటారు. పర్యావరణంతో ఇమిడి ఉన్న పర్యాటక, ప్రకృతి సంబంధిత దృశ్యాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తుంటారాయన.

ప్రతి వీకెండ్‌లో వివిధ ప్రాంతాలకు వెళుతూ అక్కడ ప్రకృతి, పర్యాటక స్థలాలను సందర్శిస్తుంటారు. అదే సమయంలో స్వతహాగా జంతు ప్రేమికుడైన ఆయన ప్రకృతిలో భాగమైన అరుదైన పక్షుల విన్యాసాలను తన కెమెరాలో భద్రపరుస్తుంటారు. ఈ వీకెండ్‌లో ఆయన తీసిన ఇమేజ్‌లను తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News