Monday, May 6, 2024

20 ఏండ్ల శ్రమ ఫలితం ఇక సున్నా.. బాధతో దేశం వదిలా: అఫ్ఘన్ ఎంపి

- Advertisement -
- Advertisement -

Everything built in 20 years now finished Says Afghan MP

న్యూఢిల్లీ:  తాను అఫ్ఘన్ వీడి రావడం బాధాకరమైన విషయం అని అఫ్ఘన్ చట్టసభ సభ్యులు నరేంద్ర సింగ్ ఖల్సా స్పందించారు. ఆదివారం ఉదయం హిండాన్ ఎయిర్ బేస్ ఇతరులతో పాటు చేరుకున్న తరువాత ఆయన తన భావోద్వేగం అణచుకోలేకపొయ్యారు. కన్నీళ్లతో తన చుట్టు ఉన్న వారితో మాట్లాడారు. 20 ఏళ్ల విజయాలన్ని మట్టి కొట్టుకుపోయినట్లే అని , తాను క్షేమంగా ఇక్కడికి చేరాను కానీ తన మనసు దేశం గురించే పరితపిస్తోందని అన్నారు. భారతదేశం చేపట్టిన తరలింపు మిషన్‌లో భాగంగా కాబూల్‌లో చిక్కుపడ్డ వారిని ఇక్కడికి చేరుస్తున్నారు. ఖాల్సా, సెనెటర్ అనార్కలి హోనార్యర్ వారి కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం ఇక్కడికి చేరారు.

తనను కాబూల్ నుంచి రక్షించి ఇక్కడికి తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఖాల్సా తెలిపారు. భారత్ తమకు మెట్టిల్లు వంటిదని, అఫ్ఘనిస్థాన్‌లో జన్మి ంచి తాము అఫ్ఘన్లుగా అక్కడ నివసిస్తూ వస్తున్నా , అంతా తమనుర హిందూస్థానీలుగానే పిలుస్తూ ఉంటారని ఈ ఎంపి విలేకరులకు చెప్పారు. కాబూల్‌ను దేశంలోని ఇతర అత్యధిక భూభాగాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల బారిన పడకుండా ఉండేందుకు పలువురు ఆ దేశం విడిచి పెట్టి రావడమే మార్గంగా ఎంచుకున్నారు. గత ఏడు రోజులుగా తాను తన కుటుంబ సభ్యులతో పాటు భయానక పరిస్థితిని ఎదుర్కొన్నానని ఖాల్సా తెలిపారు. అనుక్షణ గండం పరిస్థితి నుంచి బయటపడ్డామన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. అంతర్యుద్ధపు మరింత ముదిరిపోక ముందే అక్కడి హిందువులు, సిక్కులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఇదే విధంగా భారత ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తే అక్కడి బాధిత జనం రుణపడి ఉంటారని అన్నారు. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు.

ప్రజలు దేశం వదిలిపెట్టరాదని తాలిబన్లు బహిరంగ ప్రకటనలు వెలువరిస్తున్నారని, అయితే తాలిబన్లలో పలు వర్గాలు ఉన్నాయని, వారిలో వారికి మధ్య పూర్తి సమన్వయం లేదని, వారిలో ఓ ఎంపిగా తాను ఎవరితో మాట్లాడాలి? ఎవరిని నమ్మాలి ? అనేది అంతుచిక్కని అంశం అయిందన్నారు. ఈ లోగానే పరిస్థితి ప్రమాదకరం అవుతూ ఉండటంతో తాము చేసేది లేక భారతీయ విమానాల ద్వారా ఇక్కడికి చేరుకున్నామన్నారు. కాబూల్‌లోని పలు గురుద్వారాలలోనే అత్యధికంగా భారతీయులు, సిక్కులు తలదాచుకుని ఉన్నారని , ఇప్పటికే చాలా మంది ఇక్కడికి తిరిగి వచ్చినట్లు, అయితే తన అంచనాల ప్రకారం ఇప్పటికీ అక్కడ దాదాపుగా మరో 200 మంది వరకూ భారతీయులు, భారతీయ సంతతివారు చిక్కుపడి ఉన్నారని, తొందరగా బయటకు వచ్చేందుకు ఎదురుచూస్తున్నారని ఈ ఎంపి చెప్పారు.

ఇప్పటికైతే అఫ్ఘనిస్థాన్‌లో గురుద్వారాలు, హిందూ దేవాలయాలు భద్రంగానే ఉన్నాయని అన్నారు. శనివారం విమానాశ్రయానికి వచ్చే దారిలో తాము తాలిబన్ల వేధింపులకు గురయ్యామని తెలిపారు. భారతీయులతో కలిసి సిక్కులు వస్తూ ఉండగా తాలిబన్లు అటకాయించి వేర్వేరుగా ఉంచారని, పలువురిపై దౌర్జన్యానికి దిగారని, దీనితో తాము చేసేది లేక తిరిగి గురుద్వారాకు చేరామని తరువాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితిలో ఆ తరువాత రాత్రిపూట విఐపి ద్వారాల నుంచి విమానాశ్రయంలోకి చేరామని , ప్రతి గేటు వద్ద దాదాపుగా ఐదారు వేల మంది లోపలికి వెళ్లేందుకు ఆరాటపడుతున్న విషయాన్ని తాను గుర్తించానని ఖాల్సా తెలిపారు. తాను ఎంపిని అయినా పరిస్థితిపై ఏమీ చేయలేక , దేశాన్ని వదిలిపెట్టి రావల్సి వచ్చిందని, ఇంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతకాలపు ప్రగతి ఇక గతకాలపు జ్ఞాపకమే అవుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News