Monday, April 29, 2024

పోడు భూముల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం

- Advertisement -
  • అటవీ రెవెన్యూ భూముల పరిష్కారానికి జాయింట్ సర్వే
    ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఆర్డివో శ్రీనివాసులు
    నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు సంభందించిన, పోడు భూముల సమస్యల శాశ్వత పరిష్కారానికి,్ట ప్రభుత్వం పోడు భూముల పట్టాలను త్వరలో పంపిణీ చేయనున్నట్లు, నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు.గురువారం నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో, ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అటవీ రెవెన్యూ శాఖలకు సంబంధించిన, భూముల పరిష్కారానికి జాయింట్ సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేసి ,సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నర్సాపూర్ పట్టణ పరిధిలో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, అవి కబ్జాకు గురి కాకుండా, పరిరక్షించడం జరుగుతుందన్నారు. భూములను గుర్తించి, బ్లూకలర్ హద్దురాళ్లు ఏర్పాటు చేసి, చుట్టు కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే, దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒకజరు భాగస్వాములై, విజయవంతం చేయాలని అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, అధికారిగా తనవంతు సేవలు అందిస్తానని శ్రీనివాసులు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News