Wednesday, May 8, 2024

వాల్వ్ లీక్‌తో విఫలమైన జిఎస్‌ఎల్‌వి ప్రయోగం

- Advertisement -
- Advertisement -

Failed GSLV experiment with valve leak

న్యూఢిల్లీ : భారత అధిక బరువైన జిఎస్‌ఎల్‌వి ( జియో సింక్రనస్ శాటిలైట్ ల్యాంచ్ వెహికిల్ ) రాకెట్ గత ఆగస్టులో సాంకేతిక ఇబ్బందుల వల్ల విఫలమైందని ఇస్రోకు చెందిన వైఫల్య విశ్లేషణ కమిటీ (ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ ఎఫ్‌ఎసి ) గమనించింది. రాకెట్‌కు చెందిన వాల్యు లీక్ కావడంతో లిక్విడ్ హైడ్రెజన్ ట్యాంకులో అల్పపీడనం ఏర్పడటంతో కక్షలో జియో ఇమేజింగ్ శాటిలైట్‌ను రాకెట్ ప్రవేశ పెట్టలేక పోయినట్టు ఎఫ్‌ఎసి నివేదిక వెల్లడించింది. రాకెట్ క్రియోజెనిక్ ఇంజిన్ రాకెట్‌ను ముందుకు తీసుకు వెళ్లే సమయంలో ఈ వైఫల్యం కనిపించినట్టు ఎఫ్‌ఎసి గమనించింది. గత ఏడాది ఆగస్టు 12 న శ్రీహరికోట కేంద్రం నుంచి జిఎస్‌ఎల్‌వి ఎఫ్10 రాకెట్ ప్రయోగం జరిగింది. 307 సెకన్ల తరువాత ఈ వైఫల్యం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News