Monday, May 6, 2024

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Family of an GHMC outsource employee Suicide Attempt

అడ్డుకున్న భద్రతా సిబ్బంది.
అధికారులు వేదింపులే కారణమని ఆవేదన
అక్రమాలకు పాల్పడినందునే విధుల నుంచి తొలగింపు
అధికారుల వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబం ఆతహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. కార్యాలయం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుల అప్రమత్తంతో ప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి బాధితుడిని తీసుకువెళ్లారు. జిహెచ్‌ఎంసి అధికారి నెలనెల మాములు ఇవ్వాలని వేధింపులకు పాల్పడుతోందని, తను ఇవ్వాలేనన్న తెలపడంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు తన ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడడం వల్లే విధులను నుంచి తొలగించినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలోకి వెళ్లితే బాధితుడు రమేశ్ యాదవ్ అబిడ్స్ సర్కిల్ పరిధిలోని గత 15 ఏళ్లుగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఎ)గా విధులు నిర్వహిస్తునన్నారు.

ఇదే సర్కిల్‌లో అసిస్టెంట్ మెడికల్ అధికారి (ఎఎంహెచ్‌ఓ)గా డాక్టర్ ఉమా గౌరి గత ఏడాది కిత్రం బాధ్యతలు చేపట్టారని అప్పటీ నుంచి ఆమె ప్రతి నెల రూ.6వేల చోప్పున మాములు ఇవ్వాల్సిందిగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. తనకు వచ్చే జీతంలో కట్టింగ్‌లు పోను కేవలం రూ.14వేలు మాత్రమే చేతికి అందుతాయని తను అంతా ఇచ్చుకోలేని తెలిపడంతో వేధింపులకు పాల్పడడమే కాకుండా తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వాట్సఫ్ ద్వారా మేసేజ్ పంపించారని వెల్లడించారు. తనకు న్యాయం చేయాలని డిప్యూటీ కమిషనర్ కలసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దీంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ కలిసేందుకు గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అనుమతి లభించలేదన్నారు. ఉద్యోగమే తమ కుటుంబానికి ఆధారమని, దీంతో గత్యంతరం లేక ఆత్మహత్య పాల్పడాల్సిన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమాలకు పాల్పడడమే వల్లే రమేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగింపు : జిహెచ్‌ఎంసి అధికారులు

అబిడ్స్ సర్కిల్ ఎస్‌ఎఫ్‌ఎ గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ యాదవ్ అనే వ్యక్తి అనంతమ్మ అనే కార్మికులరాలి 2019లో మరణించగా ఆమె స్థానంలో కొడుకు లేక కూతరును నియమిస్తామని చెప్పి వారి నుంచి రూ.50,000లను వసూళ్లు చేసినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు. అయినప్పటకీ అనంతరం కుటుంబ సభ్యులను కాకుండా రమేశ్ తన బందువును ఉద్యోగం కల్పించాడు. దీంతో అనంతమ్మ కొడుకు న్యాయం కోసం ఉన్నతాధికారులు ఆశ్రయించారు .దీంతో ఈ ఉదాంతంపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా 2020 డిసెంబర్ 18న విచారించిన రమేశ్ యాదవ్ తప్పిందాలకు పాల్పడినట్లు నిరుపణ కావడంతో ఈ విషయాన్ని జిహెచ్‌ఎంసి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం రమేశ్‌ను 2021 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం కమిషనర్ ఆదేశాల మేరకు రమేశ్ స్థానంలో జూలైలో విద్యావంతులైన ఎస్‌డబ్లూజి కార్మికుడి భర్తీ చేయడం జరిగిందని వెల్లడించారు .దీంతో అప్పటీ నుంచి రమేశ్ యాదవ్ ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News