Tuesday, May 14, 2024

కళ్లు చాలని ఇళ్లు

- Advertisement -
- Advertisement -

ts

 

చుట్టూ ఆహ్లాదరకరమైన వాతావరణం, కనుచూపు మేరలో భూమికి ఆకుపచ్చ రంగేసినట్టుగా పరుచుకున్న హరితహారం ఫలాలు.. మిషన్ కాకతీయ పుణ్యమా అని కొత్త రూపు సంతరించుకున్న చెరువులు.. మధ్యలోంచి వెళ్తున్న ఔటర్ రింగ్ రోడ్డు… దానిని ఆనుకుని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన పేదల ఆత్మగౌరవ భవనాలు. పదులు కాదు, వందలు కాదు.. ఒకే చోట ఏకంగా వేలాది ఇళ్లు. నింగి నుంచి ఇలాంటి దృశ్యం కళ్లముందు సాక్షాత్కారమవుతుంటే దానిని ఎలాగైనా కెమెరాలో బంధించాలని మనసులో ఠక్కున ఆలోచనపుడుతుంది. ఇక్కడ మంత్రి కెటిఆర్ కూడా అదే చేశారు. తనలో రాజకీయ, సాంకేతిక నైపుణ్యాలే కాదు.. అందమైన ప్రకృతిలో అభివృద్ధి ఫలాలు పెనవేసుకుపోయిన చిత్రాన్ని బంధించగలిగే ఫొటోగ్రఫీ కళ కూడా ఉందని నిరూపించారు.

శనివారంనాడు వికారాబాద్ పర్యటనకు వెళ్తుండగా సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో ఒకే లోకేషన్‌లో బహుళ అంతస్థుల్లో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 15,660 డబుల్ బెడ్ రూమ్ గృహాల అద్భుత దృశ్యాన్ని కెటిఆర్ వెంటనే తన ఫోన్‌లో బంధించారు. నింగి నుంచి ఈ దృశ్యం చూస్తుంటే ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ సంబంధిత చిత్రాలను ఆదివారంనాడు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆకాశం నుంచి అందంగా కనిపిస్తున్న వికారాబాద్ ప్రాంతాన్ని చూస్తుంటే తన కెమెరాను క్లిక్‌మనిపించకుండా ఉండలేకపోయారని పంచుకున్నారు. ఓఆర్‌ఆర్‌కు అతి దగ్గరంగా నిర్మించిన ఈ ఇళ్లను త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ లబ్ధిదారులకు అందజేస్తారని, తద్వారా పేదల మోములో చిరునవ్వులు వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News