Friday, April 26, 2024

సిద్దిపేట తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

Petrol bottle

 

మన తెలంగాణ/సిద్దిపేట: తనకు రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని రోధిస్తూ ఓ రైతు పెట్రోల్ డబ్బాతో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యయత్నానికు ప్రయత్నించాడు. పూర్తి వివరాలలోకి వెళితే.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన కాసుల కిష్టయ్యకు 1975 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 2ఎకరాల పట్ట భూమిని మంజూరు చేసింది. ఈ తరుణంలో అప్పటి నుండి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, గత రెండు నెలుగా ఆ భూమికి సంబందించిన డాక్యుమెంట్‌లలో ఆ భూమి అతని పేరు మీద రావడంలేదు. అదేంటని గ్రామ విఆర్వోని అడగగా దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ఆ గ్రామ విఆర్‌వో, విఆర్‌ఎలు కిష్టయ్యకు తెలిపారు. తన భూమిని తనకు అప్పగించాలని లేని పక్షంలో ఇదే కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడతానని రైతు హెచ్చరించాడు. ఈ విషయంపై అర్బన్ తహసీల్దార్ విజయ్ సాగర్‌ను వివరణ కోరగా 1975లో కాసుల కిష్టయ్య రాజయ్యకు మిట్టపల్లి శివారులోని సర్వే నెంబర్ 308లో 2ఎకరాల భూమిని అసైట్‌మెంట్ చేయడం జరిగిందన్నారు. ఇదే భూమిని కాసుల కిష్టయ్య సిద్దిపేటకు జిల్లాకు చెందిన క్రిష్ణ మూర్తి అనే వ్యక్తికి 2012లో అమ్ముకున్నాడని.. అది సీలింగ్ భూమి కావడంతో దానిని అమ్మడానికి, కొనడానికి వీలు లేదని అందువల్లే వారిద్దరికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఇదిఇలా ఉండగా కిష్టయ్య భూమిని అమ్మిన విషయాన్ని దాచిపెట్టి అధికారులను బెదిరించడానికి ప్రయత్నం చేశాడన్నారు. సంబందిత అధికారులు వెంటనే విక్రయ ఆదారాలు చూపగానే అతడు తిరిగి వెళ్లి పోయాడని పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యయత్నం పై విచారణ చేపట్టాలి: మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యకు యత్నించడంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఫోన్‌లో ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులను గౌరవించి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించాలని పేర్కొన్నారు. రైతు కాసుల కిష్టయ్య భూ రికార్డుల సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

Farmer Attempt Suicide at Siddipet MRO Office

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News