Sunday, April 28, 2024

వెట్ రన్ పై సర్వత్రా ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

అనంతగిరి రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోతలపై అస్పష్టత
ఎస్సీఖాళీని వాసుల ఖాళీచేయించిన అధికారులు
నీటిఎత్తిపోత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి
వాయిదా పడుతున్న నీటి ఎత్తిపోత

మనతెలంగాణ/ఇల్లంతకుంట: మహా ప్రాజెక్టు కోసం మహాబావి సిద్దమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీలో భాగంగా అనంతగిరి రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి కావస్తున్నాయి. మొదటగా అనంతగిరి రిజర్వార్‌లోకి టిఎంసి నీటిని వెట్ రన్ ద్వారా విడుదల చేస్తారని రోజు అధికారులు చెబుతూవచ్చారు. దీంతో మొదటగా నీటమునిగే అనంతగిరి ఎస్సీ కాలనీ వాసులు ఇండ్లను ఖాళీ చేయించే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. వారం రోజులుగా ఎస్సీకాలనీ వాసులను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తూ ఇండ్లను కూలగోట్టే పనులో అధికారులు నిమగ్నమయ్యారు. కానీ ఎస్సీకాలని చెందిన కొందరు ప్రాజెక్టుపై కోర్టుకు వెళ్లారు. వీరి కుటుంబాలను ఖాళీ చేయడం ఇబ్బందిగా మారడంతో స్వయంగా జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రంగంలోకి దిగారు. బైక్‌పై స్వయంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోర్టుకు వెళ్లిన కుటుంబాల వద్దకు వెళ్లి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పడంతో వారు ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నారు. వారు ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ నీటి ఎత్తిపోతల్లో స్పష్టత లేకపోవండంతో అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

మహాబావి మహా అద్భుతం…

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాబావి ‘సర్జిఫుల్’.. దీని ఎత్తు 93మీటర్లు, 56 మీటర్ల వెడల్పు తో సర్జిఫుల్‌ను నిర్మాణం చేశారు. 106 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు బహుబలి మోటర్లతో నీటిని అనంతగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు తయారు చేశారు. మొత్తం రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టిఎంసి లు కాగా మొదటగా 1టిఎంసి నీటిని ప్రాజెక్టులో నింపే ప్రయత్నం చేస్తున్నారు.

వాయిదా పడుతున్న నీటిఎత్తిపోత…

అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీటి విడుదల చేస్తున్నారని అధికారులు గత పదిరోజులుగా నిర్వాసితులకు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో నీటిని విడుదల చేస్తున్నారని, ముందుగా ఎస్సీ కాలనీ వాసులు ఇండ్లను ఖాళీ చేయాలని ఊరిలో దండోర వేయించారు. కానీ నీటి విడుదల జరగలేదు, ప్రస్తుతం మార్చి 6వ తేదీన నీటి విడుదల జరగవచ్చని అధికారులు చెబుతున్నారు.

 

Bahubali surgical fool waiting for ananthagiri

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News