Friday, April 26, 2024

వరిలో కరేద పద్ధతి వైపు రైతు చూపు

- Advertisement -
- Advertisement -

కూలీల కొరత, పెట్టుబడి తగ్గించేందుకు కరేద
పలు మండలాల్లో కరేద వరి వేసిన రైతులు

Farmer concentrate paddy kareda method

 

మన తెలంగాణ/మల్హర్: వ్యవసాయం చేయాలంటే కూలీల కొరత, అధిక పెట్టుబడి, గిట్టుబాటు ధర లేక రైతులు సతమతమవుతున్న తరుణంలో కరేద వరి రైతులకు ఊరటనివ్వనుంది. వరి పండించే రైతుల్లో కూలీలు దొరకక వరి నాటు వేయడం రైతుకు కీలక సమస్యగా మారింది. దీంతో రైతులు భూమిని చదును చేసుకొని ఒక్కరోజు నానపెట్టిన వరి విత్తనంను పొలంలో చల్లండద్వారా పొలం నాటు పూర్తి అవుతుంది. అదే వరి నాటు వేయాలంటే 25 రోజుల ముందు నారుమడి పెంచుకోవాలి, కూలీలతో నాటు వేయించాలి. కరేద ద్వారా వరి వేస్తే విత్తనాలు తక్కువగా పడుతాయి, నాటు కూలీల పెట్టుబడి రూ.6 వేల వరకు తగ్గనుంది, కూలీల కొరత తీరనుంది. ఖరీఫ్ లో కొంత మంది రైతులు కరేద ద్వారా వరి నాటు చేయడంతో బాగానే దిగుబడి రావడంతో యాసంగిలో ఈ పద్దతిని కాటారం, మల్హర్ మండలల్లో కొంతమంది రైతులు ఈ పద్దతి ద్వారా నాట్లు వేశారు. యాసంగిలో ఈ పద్దతి ద్వారా దిగుబడి వస్తే రానున్న కాలంలో అందరు రైతులు ఇదే పద్దతిని పాటించనున్నారు. దీంతో కూలీల కొరత తీరి, పెట్టుబడి తగ్గనుంది. అయితే ఎక్కువగా నీరు నిలువ ఉండే భూముల్లో కాకుండా నీరు తక్కువ పీల్చుకునే భూముల్లో కరేద పద్దతి అనుకూలంగా ఉండనుంది. ఒక్కరోజు మొలుకెత్తిన విత్తనాన్ని వ్యవసాయ అధికారులు డ్రంబు సీడర్ ద్వారా వేయాలని చెప్తున్నా ఆ పద్దతి పెద్దగా అనువుగాలేదని చేతితో అలుకుతున్నారు. వ్యవపాయంలో అధునిక పద్దతులు రాక మందు కరేద పద్దతి ఉండేది, కాని కలుపు సమస్య ఉండేది, గడ్డి మందులు రావడంతో ఈ పద్దతిలో కలుపు సమస్య నుండి అధగమిస్తున్నారు.

కూలీల కొరుత తోనే కరేద వేశా

కూలీలు దొరకకపోవడంతో వరి నాటులో కరేద పద్దతి పాటించాను. నాటు వేయాలంటే కూలీల కోసం తిరిగి విసిగి పోవల్సివచ్చింది. దీంతో పెట్టుబడి రూ.6 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది. ఈ పద్దతి ద్వారా పని బారం తగ్గింది. నాకున్న 5 ఎకరాలలో కరేద ద్వారా నాటు వేశాను.
వెమునూరి సతీష్ రైతు
గ్రామం కుంభంపల్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News