Friday, April 26, 2024

కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు

- Advertisement -
- Advertisement -

Farmers' unions reject Centre's proposal

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. మూడు కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది. ప్రభుత్వం మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్ర పేర్కొంది. ఎపిఎంసిలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ చేస్తామని ప్రతిపాదనలో తెలిపింది. కేంద్రం సూచించిన అన్ని ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. కొత్త చట్టాల రద్దు తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని రైతు సంఘాలు చెబుతున్నాయి. సింఘు సరిహద్దు వద్ద జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నాయి రైతు సంఘాలు. దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం- రైతు సంఘాల చర్చలు విఫలం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News