Saturday, April 27, 2024

పండుగ చేసుకుంటున్న రైతులు

- Advertisement -
- Advertisement -

Farmers welcoming new Revenue act

 

రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ భారీ ప్రదర్శనలు
సిఎంచిత్రపటానికి క్షీరాభిషేకాలు

మనతెలంగాణ/హైదరాబాద్: నూతన రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో రైతు రాజ్యస్థ్ధాపన జరిగిందనడానికి ఊరూరా రైతులు దసరా పండుగకు మించిన సంబురాలు చేసుకుంటున్నారు. సిఎం కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ వేలాదిమంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఆనందోత్సవాల్లో మునిగిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆనందంతో బాణాసంచా కాలుస్తూ ప్రదర్శనగా ముందుకు సాగుతున్నారు. పరిగిలో రైతుల ప్రదర్శనను రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రంగాపూర్ స్టేజీ నుంచి పరిగివరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో రైతు రాజ్యస్థాపనకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి ఫలితమే నూతన రెవెన్యూ చట్టమని ఈసందర్భంగా మంత్రి సబితా చెప్పారు. దేశచరిత్రలోనే ఏనాడు జరగని మార్పును సిఎం కెసిఆర్ తీసుకువచ్చారని చెప్పారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, శాసనసభ్యుడు కె.మహేష్‌రెడ్డి సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

రైతులతో కలిసి ఎంపి రంజిత్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లు నడిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయర్తి మండలంలో వరంగల్, ఖమ్మం హైవేలపై రైతులు భారీ ర్యాలీని నిర్వహించారు. ఐదు కిలోమీటర్ల పాటు సాగిన ఈ రైతుల ప్రదర్శనను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ దగ్గర రైతులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు. భూగోళం ఉన్నం త వరకు రైతులకు సమస్యలు లేకుండా సిఎం కెసిఆర్ అనేక చట్టాలను తీసుకువచ్చారని వారు చెప్పా రు.

పట్టణంలోని ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ రైతుల్లో మరింత ఉత్సాహం నింపారు. శాసనసభ్యుడు దివాకర్ రావు ఆధ్వర్యంలో దండెపల్లి మండలం మ్యాదరిపేట నుంచి లక్షెట్టిపేట వరకు రైతులు ప్రదర్శనను నిర్వహించారు. దండెపల్లిలో ఎంఎల్‌ఏ దివాకర్ రావు మాట్లాడుతూ విఆర్‌ఒ వ్యవస్థను రద్దుచేయడంతో రైతులకు మేలు జరిగిందన్నారు. రైతులను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టి అమలు చేయడంతో పాటుగా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి రైతుల భూములకు భద్రత కల్పించారని చెప్పారు. అనంతరం దివాకర్ రావు రైతులతో కలిసి సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గంభీరావుపేటలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు భారీ ప్రదర్శను నిర్వహించారు.

పేద, మధ్యతరగతి ప్రజలను ల్యాండ్ మాఫియా నుంచి కాపాడేందుకు సిఎం కెసిఆర్ రెవెన్యూ చట్టం తీసుకువచ్చారని చెప్పారు. చింతపల్లిలో రైతులు భారీర్యాలీ నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు రెడ్యానాయక్, కురవి మండలాధ్యక్షుడు తోటలాలయ్య ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు రైతుర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల, మండలాల టిఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News