Wednesday, May 15, 2024

నల్లితో వచ్చిపడి నలిపివేస్తుంది

- Advertisement -
- Advertisement -

Fear of Congo fever in Maharashtra

 

పల్గార్ : మహారాష్ట్రలో కాంగో ఫివర్ భయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పల్గార్ జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరించారు. ఈ జ్వరం ప్రత్యేకించి తలలో ఉండే పేలతో వ్యాపిస్తుంది. క్రిమియన్ కాంగో హెమోరాజిక్ ఫివర్ (సిసిహెచ్‌ఎఫ్) గా వ్యవహరించే ఈ కాంగో జ్వరం పట్ల అంతా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో పశువుల పెంపకందార్లు, మాంస విక్రేతలు పశుసంరక్షణ అధికారులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాపశుసంవర్థక విభాగం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ ప్రహ్లాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగో జ్వరానికి ఇప్పటికైతే పనికివచ్చే మందు లేదని, ఇది సోకకుండా నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమమార్గం అని తెలిపారు.

గుజరాత్‌లోని కొన్ని జిల్లాల్లో ఈ కాంగో కొందరికి సోకింది. దీనితో పొరుగున ఉండే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు ఈ బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాకు పల్గార్ జిల్లా దగ్గరలోనే ఉంది. ఇది పేలు ద్వారా పలు పేలులకు వ్యాపించి మనిషికి సోకేందుకు వీలుందని వైద్య అధికారులు తెలిపారు. నల్లికి సోకే వైరస్ రక్తం ద్వారా మనిషికి సంక్రమిస్తుందని, లేదా ఈ కాంగో వైరస్ సోకిన ప్రాణిబారిన పడ్డ జంతువుల మాంసాహారం తీసుకుంటే కూడా కాంగో ఫివర్ వచ్చే వీలుందని వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News