Saturday, May 4, 2024

మోడీ-ఇండియా కూటమి మధ్యే పోటీ: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బిజెపి భావజలంపైనే తమ పోరాటం ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం బిజెపి చేస్తోందని, కొద్దిమంది చేతుల్లోకి దేశం పోతుందని దుయ్యబట్టారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. దేశం కోసం తాము పోరాటం చేయాల్సి వస్తుందని, మోడీ, బిజెపి – ఇండియా కూటమి మధ్యే పోటీ నెలకొందన్నారు. బిజెపి పాలనలో నిరుద్యోగం పెరిగిందని, దేశ ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని రాహుల్ వివరించారు. దేశ ప్రజల గొంతుకల అణచివేతపై తమ పోరాటం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన సమయం ఆసనమైందన్నారు. కొత్త కూటమి పేరు ఇండియా (INDIA – ఇండియన్, నేషనల్, డెవలప్ మెంట్, ఇన్‌క్లూసివ్, అలయన్స్) నామకరణం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News