Sunday, April 28, 2024

ఒక బిహారీ… 9 హత్యల కేసులో నేడు తుది తీర్పు

- Advertisement -
- Advertisement -

Final verdict today in Gorrekunta ten Murder case

 

వ‌రంగ‌ల్ రూరల్ : వరంగల్ రూరల్ జిల్లాలోని గొర్రెకుంట పాడుబడ్డ బావి కేసులో ఇవాళ‌ తుది తీర్పు వెలువ‌డ‌నుంది. ఈ బావిలో తొమ్మిది మృతదేహాలు లభ్యం కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన విషయం తెలిసిందే. ఒక హత్యను కప్పిపుచ్చేందుకు నిందితుడు తొమ్మిది మందిని పథకం ప్రకారం హతమార్చాడు. బావిలో ప‌డేసి తొమ్మిది మందిని హ‌త్య‌చేసిన కేసులో ఇప్ప‌టికే విచార‌ణ పూర్త‌య్యింది. దీంతో జిల్లా అద‌న‌పు కోర్టు ఈరోజు తీర్పు వెల్ల‌డించ‌నుంది. బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ మే 21న తొమ్మిది మందిని హ‌త్య‌చేసి వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జ‌ల‌స‌మాధి చేశాడు.

మృతుల వివరాలు

గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం (45), కూతురు బుష్రా ఖాతూన్ ‌(20), మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం (19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21), శ్రీరాం కుమార్‌షా (26) , మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్ ‌(30) అనే డ్రైవర్  ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News