Friday, May 3, 2024

మోడీ పాలనలో పేద ప్రజలపై ఆర్థిక భారం

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్ : ప్రజల సంక్షేమం కోసమే సిపిఐ పోరాటాలు సాగిస్తుందని పేదలపై ఆర్థిక భారం మోపే విధంగా కేంద్రంలో మోడీపాలన కొనసాగిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని స్థ్ధానిక అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో హుస్నాబాద్ , అక్కన్నపేట, కోహెడ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ రాజకీయాలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ్ధలను అన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తూ ప్రశ్నిస్తున్న మేదావుల , ప్రజాస్వామిక వాదులను దేశ ద్రోహం పేరుతో ఉపా చట్టం కేసులు మోపి ఆరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు.

బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పల్లె పల్లెకు గడప గడపకు తిరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలకు సిద్ధ్దం కావాలని సిపిఐ కంచుకోట హుస్నాబాద్ నియోజక వర్గంలో గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్,సిపిఐ రాష్ట్రకౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, నాయకులు జాగీర్, సత్యనారాయణ, కోయ్యడ సృజన్‌కుమార్, యెడల వనేశ్, కొమ్ముల బాస్కర్, ముంజ గోపి, సనువాల ప్రతాప్‌రెడ్డి, గూడ పద్మ, జేరిపోతుల జనార్ధన్, సంగెం మదు, అయిలేని మల్లారెడ్డి, గంబీరపు మధు, ఏలూరి స్వాతి, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News