Tuesday, May 7, 2024

అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident in Tyre Godown At Afzalgunj

హైదరాబాద్: నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్ లైబ్రరీ వద్ద నిల్వ ఉంచిన టైర్లకు మంటలు అంటుకున్నాయి. ఘటనాస్థలిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. దీంతో చాదర్ ఘాట్- అఫ్జల్‌గంజ్ మార్గంలో ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఘటనాస్థలిలో సమీపంలోనే పెట్రోల్ బంకు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చాదర్ ఘాట్- అఫ్జల్‌గంజ్ మార్గంలో వాహన రాకపోకలు నిలిచివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Fire Accident in Tyre Godown At Afzalgunj

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News